Sania Mirza: ఇండియా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ మధ్య విబేధాలు నెలకొన్నాయని, ఈ జంట విడాకులు కూడా తీసుకున్నారని గత కొన్నిరోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. సానియా హృదయం ముక్కలు అయ్యిందంటూ ట్వీట్ పెట్టడం ఆలస్యం.. అసలు ఏమైంది ఈ జంటకు.. వీరిద్దరికి ఎక్కడ చెడింది అంటూ నెటిజనులు ఆరా తీయడం మొదలుపెట్టి ఎట్టకేలకు ఇదే కారణమంటూ ఒక కారణాన్ని కనుక్కున్నారు. అదేంటంటే.. సానియా కాపురంలో నిప్పులు పోసింది ఒక పాకిస్థాన్ మోడల్ కమ్ నటి అని చెప్పుకొస్తున్నారు. అవును ఆ మోడల్ పేరు అయేషా ఒమర్. ఆమెతో షోయబ్ కు పరిచయం ఎక్కడ అంటే.. వీరిద్దరూ కలిసి ఒక ఫోటో షూట్ లో నటించారట.
ఇక ఆ ఫోటోషూట్ ను ఇప్పుడు బయటికి తీసి దీనివల్లనే ఈ జంట విడిపోయారని చెప్పుకొస్తున్నారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఏదో సంబంధం నడుస్తుందట. అది కాస్తా సానియాకు తెలియడం, ఆమె షోయబ్ తో గొడవ పడడం వలనే విబేధాలు తలెత్తాయని చెప్పుకొస్తున్నారు. ఇక అందుతున్న సమాచారం ఈ బ్యూటీతోనే షోయబ్ రెండో పెళ్ళికి సిద్దమవుతున్నాడట. గతంలో ఈ ఫోటోషూట్ పై కూడా షోయబ్ సరైన సమాధానము ఇవ్వలేదు.. ఇలాంటి బోల్డ్ ఫోటోషూట్ చేశారు.. సానియా ఏమి అనలేదా అని యాంకర్ అడిగితే.. మీ భర్త ఇలా చేస్తే మీరేమంటారు అని ఎదురు ప్రశ్న వేశాడు. అందుకు యాంకర్ తనకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పగా.. సానియా కూడా అలాగే లైట్ తీసుకున్నదని చెప్పుకొచ్చాడు. అంటే తన భర్త వేరొక అమ్మాయితో ఉన్నా కూడా సానియాకు పర్వాలేదని ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చాడు. ఏదిఏమైనా ఈ వార్తలు అన్నింటికి ఫుల్ స్టాప్ పడాలంటే సానియా నోరు విప్పాల్సిందే..