పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఒక సినిమాలో నటిస్తున్నాడు అంటే ఆ మూవీకి సంబంధించిన ఏ న్యూస్ అయినా అది ఇండియాకి షేక్ చేసే ఓకే సెన్సేషన్ అవుతుంది. అలాంటిది ఒక్క అఫీషియల్ అప్డేట్ లేకుండా ప్రభాస్ సినిమా షూటింగ్ ని చేసేస్తున్నాడు దర్శకుడు మారుతీ. ప్రభాస్, మారుతీ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అవుతుంది అంటేనే ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. అందుకే పూజా కార్యక్రమాల విషయాలని కూడా బయటకి వెల్లడించకుండా డైరెక్ట్ గా సినిమా షూటింగ్ చేసేస్తున్నాడు మారుతీ. ఇప్పటికే ఈ మూవీకి సంబందించిన రెండు షెడ్యూల్స్ ని మారుతీ కంప్లీట్ చేశాడు. ఇటివలే జరిగిన షూటింగ్ నుంచి ప్రభాస్, మారుతీ కలిసి ఉన్న ఫోటోలు లీక్ అయ్యి నెట్ లో వైరల్ అయ్యాయి. లీక్ అయిన ఫోటోస్ లో ప్రభాస్ స్టైలిష్ గా ఉండడంతో ప్రభాస్ అభిమానుల దృష్టి మారుతీ సినిమాపై పడింది. ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ని ఫిబ్రవరి రెండో వారంలో చెయ్యనున్నారని సమాచారం.
ప్రభాస్, మాళవిక మోహనన్ లు ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారు. ఇదిలా ఉంటే ఫిల్మ్ నగర్ వర్గాల్లో జరుగుతున్న డిస్కషన్ ని బట్టి చూస్తే… ఈ మూవీలో అప్పుడప్పుడూ ప్రభాస్ లోకి ఒక ఆత్మ వచ్చి వెళ్తుందని, దాని ద్వారా ఫన్ జనరేట్ చేస్తూ సినిమా సాగుతుందని సమాచారం. ప్రభాస్ తో కామెడీ టచ్ ఉన్న సినిమా లేదా పూర్తిస్థాయి కామెడీ సినిమా చేయాలంటే దర్శక నిర్మాతలకి చాలా ధైర్యం కావాలి. కథలో ఎంతో విషయం ఉంటేనే ఆ సినిమా ప్రేక్షకులని మెప్పిస్తుంది. మారుతీ ట్రాక్ రికార్డ్ చూస్తే ప్రభాస్ ఫాన్స్ కి ఆ ధైర్యం వచ్చే అవకాశం తక్కువ. హారర్ కామెడి జానర్ లో రూపొందుతున్న సినిమా అనే వార్త వినీ భయపడుతున్న ప్రభాస్ ఫాన్స్, ఆ కటౌట్ తో కామెడీ సినిమా ఏంటబ్బా అనే ఫీలింగ్ లో ఉన్నారు. మరి అందరి అనుమానాలని చెరిపేస్తూ మారుతీ, రెబల్ స్టార్ ఫాన్స్ కి హారర్ కామెడీ జోనర్ లో సాలిడ్ హిట్ ఇస్తాడేమో చూడాలి.