Ravindra Jadeja Rapid Fire: టీమిండియాలో బెస్ట్ స్లెడ్జర్ ఎవరు?.. రవీంద్ర జడేజా సమాధానం ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravindra Jadeja Opened The Secrets Of Indian Cricketers in Rapid Fire: సోషల్ మీడియాలో ‘ర్యాపిడ్-ఫైర్’ రౌండ్‌కు మంచి క్రేజ్ ఉంటుంది. ఈ రౌండ్లో ఎన్నో ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేయడమే ఈ ర్యాపిడ్-ఫైర్ ముఖ్య ఉద్దేశం. ర్యాపిడ్-ఫైర్ రౌండ్‌కు చాలా మంది సెలెబ్రిటీలు సమాధానం ఇచ్చారు. ఇటీవల భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. టీమిండియాలో బెస్ట్ స్లెడ్జర్ ఎవరు?, ఎవరికి మంచి గడ్డం ఉంటుంది అనే విషయాలు పంచుకున్నాడు.
గత నెలలో లండన్‌లోని ఓవల్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సమయంలో స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ర్యాపిడ్-ఫైర్ రౌండ్లో రవీంద్ర జడేజా పాల్గొన్నాడు. ప్రస్తుతం భారత జట్టు వెస్టిండీస్ పర్యటన సన్నాహాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆ వీడియో మరోసారి సోషల్ ఈడియలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో జడ్డు చెప్పిన ఆసక్తికర సమాధానాలు ఏవో ఓసారి చూద్దాం.
Also Read
- ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
- KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
# టీంలో ఎవరికి మంచి గడ్డం ఉంది?
నా గడ్డం కూడా బాగానే ఉంటుంది అని అనుకుంటున్నా. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మంచి గడ్డంను కలిగి ఉంటారు.
# మోస్ట్ ఇంప్రూవ్డ్ గేమర్ ఎవరు?
చేతేశ్వర్ పుజారా వందల మ్యాచులు ఆడాడు. అతడే మోస్ట్ ఇంప్రూవ్డ్ గేమర్.
# ఫన్నీయెస్ట్ వాట్సాఫ్ ఫార్వర్డర్?
ఇషాన్ కిషన్. భారత జట్టు ప్రాక్టీస్ సెషన్‌ను అతడు బాగా ఎంటర్టైనింగ్గా చేస్తాడు.
Also Read: Pawan Kalyan: కథ నచ్చకపోతే కాల్చేస్తారా?.. పవన్ కల్యాణ్‌ను అడిగిన డైరెక్టర్!
# బెస్ట్ స్లెడ్జర్ ఎవరు?:
ఇంకెవరు.. విరాట్ భాయ్.
# విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలో ఎవరు ఫన్నీ?
విరాట్ కోహ్లీ టీం సభ్యులను అనుకరిస్తూ ఆటపట్టిస్తుంటాడు. రోహిత్ శర్మ కూడా ఫన్నీనే.
# డీజే ఎవరు?
విరాట్ కోహ్లీ. కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్‌లోకి రాగానే మ్యూజిక్‌ను ఎంజాయ్ చేస్తాడు.
# తొందరగా రిప్లై ఇచ్చేది ఎవరు?
యుజ్వేంద్ర చహల్
# రీల్ కింగ్ ఎవరు?
ఇద్దరు ఉన్నారు. యుజ్వేంద్ర చహల్, శిఖర్ ధావన్
Also Read: Bro Teaser: పూజా లేకుండా సినిమాలు తీయరా?.. త్రివిక్రమ్‌ను ఆడుకుంటున్న నెటిజన్లు!
Batting. Bowling. Fielding. Rapid Fire. 🎙️
There's absolutely nothing that @imjadeja can't slay, as he candidly spills secrets from #TeamIndia dressing room in our lightning-fast Rapid Fire round!#Believe #Cricket pic.twitter.com/pJGMyEzYml
— Star Sports (@StarSportsIndia) June 10, 2023
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!