Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ కొడుకు రఫా రఫా.. 100 బంతుల్లో 151 పరుగులతో విధ్వంసం..
- అదరగొడుతున్న రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్..
- అండర్-19 క్రికెట్లో మరో భారీ ఇన్నింగ్స్..
- గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 151 రన్స్..
- 100 బంతుల్లోనే 151 పరుగులు అన్వయ్ ద్రవిడ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anvay Dravid: భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ అండర్-19 క్రికెట్లో అదరగొట్టాడు. వినూ మంకడ్ ట్రోఫీ ఎలైట్ టోర్నీలో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 ఏళ్ల అన్వయ్ కేవలం 100 బంతుల్లోనే 151 పరుగులు చేసి కర్ణాటకకు అద్భుత విజయాన్ని అందించాడు. అతడి మెరుపు ఇన్నింగ్స్‌తో కర్ణాటక అండర్-19 జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలిచి నాకౌట్ దశకు అర్హత సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో అన్వయ్ 20 ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు.
భారీ లక్ష్యాన్ని ఛేదించిన కర్ణాటక
అక్టోబర్ 16న విజయనగరంలోని విజ్జీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. సమీర్ భండారి 88 బంతుల్లో అజేయంగా 119 పరుగులు చేయగా, యశ్ పంజ్వానీ కేవలం 57 బంతుల్లో అజేయంగా 106 పరుగులు సాధించాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 217 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో గుజరాత్ భారీ స్కోరు సాధించింది. వీజేడీ (VJD) పద్ధతి ప్రకారం కర్ణాటకకు 352 పరుగుల సవరించిన లక్ష్యం నిర్దేశించారు. ఈ భారీ లక్ష్య ఛేదనలో అన్వయ్ ద్రవిడ్, ధ్రువ్ కృష్ణన్ కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 203 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను కర్ణాటక వైపు తిప్పారు. ధ్రువ్ కృష్ణన్ కూడా 100 బంతుల్లో 131 పరుగులతో అద్భుతంగా రాణించాడు. చివరకు కర్ణాటక 45.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
Also Read
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
- Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీలో మరో ప్రత్యేకత.. ఎంఎస్ ధోనీ తర్వాత అదరగొడుతున్న ‘బేబీ బాస్’..
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ వల్లే నా భార్య దులీప్ ట్రోఫీ చూసింది’.. శ్రీకాంత్ కామెంట్స్ వైరల్
టోర్నీలో అన్వయ్‌కు రెండో సెంచరీ
ప్రస్తుత వినూ మంకడ్ ట్రోఫీలో అన్వయ్ వరుసగా రాణిస్తున్నాడు. అంతకుముందు చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో 62 బంతుల్లో 104 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో కర్ణాటక 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీతో జరిగిన మరో మ్యాచ్‌లో కేవలం 41 బంతుల్లో 85 పరుగులు సాధించి తన దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు గుజరాత్‌పై 151 పరుగులు చేయడంతో ఈ టోర్నీలో రెండో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు.
కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా కీలక బాధ్యతలు
కర్ణాటక అండర్-19 జట్టుకు అన్వయ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నాడు. చిన్న వయసులోనే జట్టుకు నాయకత్వం వహిస్తూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడటం విశేషం. గత ఏడాది నవంబర్‌లో శ్రీలంక పర్యటన సందర్భంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత అండర్-19 జట్టుకు అరంగేట్రం చేశాడు. ఇక, అంతర్జాతీయ యువ క్రికెట్లోనూ అన్వయ్ తన ప్రతిభను చాటుకున్నాడు. జూలైలో శ్రీలంక పర్యటనలో జరిగిన యూత్ వన్డే సిరీస్ రెండో మ్యాచ్‌లో 67 బంతుల్లో 87 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వర్షం కారణంగా కుదించిన యూత్ వన్డే మ్యాచ్‌లో 18 బంతుల్లో 38 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి. ఆ మ్యాచ్‌లో భారత్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Sangameswara Temple: ఆరు నెలల ముందే బయటపడ్డ సంగమేశ్వరుడు.. కృష్ణా తీరంలో ముందస్తుగా కరవు ఛాయలు.!
-
Russia: పుతిన్‌కు రష్యా సైనిక అధికారి వెన్నుపోటు.. ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే..!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ కొడుకు రఫా రఫా.. 100 బంతుల్లో 151 పరుగులతో విధ్వంసం..
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Team India: ఐదు వన్డేలు, ఇద్దరు కెప్టెన్లు.. ఆకాష్ దీప్ రీఎంట్రీ.. జస్ప్రీత్ బుమ్రాపై బీసీసీఐ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!