Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
- మహారాష్ట్రలో దారుణం
- వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
- ఇద్దరు నిందితులు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త ఇంట్లో లేని సమయంలో అతడి స్నేహితులైన ఇద్దరు వ్యక్తులు వివాహితపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఎవరికైనా చెబితే నాలుగేళ్ల కుమారుడిని చంపేస్తామని బెదిరించారు. అక్టోబర్ 8 రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. అక్టోబర్ 8 రాత్రి మహిళ భర్త ఇంట్లో లేని సమయంలో ఇద్దరు నిందితులు ఇంట్లోకి వచ్చి వివాహితపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబితే ఆమె నాలుగేళ్ల కుమారుడిని చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి పారిపోయినట్లు సీనియర్ పోలీసు ఇన్స్పెక్టర్ లాలు తురే తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విరార్ పోలీసులు శుక్రవారం సూరజ్ యాదవ్, విశాల్ అనే ఇద్దరిని అరెస్టు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
Also Read
అరెస్టు చేసిన నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం వారికి నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులు బాధితురాలి భర్తకు స్నేహితులని, గతంలో తరచూ వారి ఇంటికి వచ్చేవారని పోలీసులు తెలిపారు. చిన్నారిని చంపేస్తామని బెదిరించినట్లు వచ్చిన ఆరోపణలపైనా దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
-
Delhi-Tihar Jail: తీహార్ జైలులో సీజేపీ నేతలకు స్పెషల్ ట్రీట్మెంట్..
-
LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులెటిన్ విడుదల..
-
Janasena First List: 2 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలకు జనసేన అభ్యర్థులు ఖరారు.. తొలి జాబితా పూర్తి వివరాలు ఇవే
-
Naga Vamsi : భారీ రేట్లు చూసి భయపడ్డా కానీ దసరాకే లాభాల పంట.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!