Delhi-Tihar Jail: తీహార్ జైలులో సీజేపీ నేతలకు స్పెషల్ ట్రీట్మెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi-Tihar Jail: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎలాంటి అనుమతి లేకుండా ప్రవేశించారనే ఆరోపణలతో అరెస్టయిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) నేతలు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లను తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ జైల్లో సీజేపీ నాయకులకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారట. అంటే.. వీరిని ప్రత్యేక హై-సెక్యూరిటీ వార్డుల్లో వేర్వేరుగా ఉంచారట. ఇందుకు సంబంధించి అధికారుల నుంచి పూర్తి వివరాలు తెలిశాయి.
అక్టోబర్ 14న శాంతిభద్రతలకు భంగం కలిగించేలా పదే పదే ప్రయత్నించారన్న అభియోగాలతో ఢిల్లీ పోలీసులు వీరిద్దరినీ అరెస్టు చేశారు. ఒకవేళ వీరికి బెయిల్ ఇస్తే మళ్లీ చట్టాన్ని ఉల్లంఘించి ఇతరులను రెచ్చగొట్టే అవకాశం ఉందన్న బలమైన అనుమానంతో, కోర్టు వీరిని ఐదు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. ఆ తర్వాతే వీరు తీహార్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇక, జైలు రికార్డుల ప్రకారం.. అశుతోష్ రంకా ఖైదీ నంబర్ 1784 కాగా, సౌరవ్ దాస్ ఖైదీ నంబర్ 3752. మొదట వీరిద్దరినీ జైలు నంబర్ 2లోనే ఉంచారు. కానీ ఆ తర్వాత అశుతోష్ రంకాను జైలు నంబర్ 4కి మార్చారు. ప్రస్తుతం సౌరవ్ దాస్ జైలు నంబర్ 2లోని వార్డ్ నంబర్ 3లో ఉండగా, రంకా జైలు నంబర్ 4లోని వార్డ్ నంబర్ 15లో ఉన్నారు. మిగతా బ్లాక్‌లతో పోలిస్తే వీరు ఉన్న బ్లాక్‌లలో కొంచెం ఫ్రీగా ఉంటుందట.
Also Read
- LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులెటిన్ విడుదల..
- Janasena First List: 2 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలకు జనసేన అభ్యర్థులు ఖరారు.. తొలి జాబితా పూర్తి వివరాలు ఇవే
- TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
- Katie Zacharia: ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉంది.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగింపుపై జకారియా కీలక పోస్ట్!
ఈ వార్డులు చాలా ప్రత్యేకమైనవని జైలు వర్గాలు తెలిపాయి. వేరే వార్డులకు చెందిన ఏ ఖైదీని కూడా ఈ వార్డులలోకి అస్సలు రానివ్వరు. వీరి కదలికలను నిరంతరం గమనించేందుకు సెల్స్‌లోనే సీసీటీవీ కెమెరాలను అమర్చారు. అంతేకాకుండా రౌండ్-ది-క్లాక్ వీరిని సూసైడ్ వాచ్ (ఆత్మహత్య నిఘా) కింద ఉంచినట్లు ఓ అధికారి జాతీయ మీడియా సంస్థకు వెల్లడించారు. గురువారం నాడు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, ఆ పార్టీ లీగల్ హెడ్ రత్న సింగ్ వీరిని కలిసి పలకరించారు. సౌరవ్ దాస్ ఉన్న జైలు నంబర్ 2లోనే గతంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఉంచారు. అలాగే, ప్రస్తుతం జేఎన్ యూ మాజీ విద్యార్థి, ఆందోళనకారుడు ఉమర్ ఖాలిద్ కూడా వేరే హై-రిస్క్ సెల్లో ఇదే జైలులో ఉన్నారు. ఇక రంకాను ఉంచిన జైలు నంబర్ 4ను గతంలో జైలు అధికారులు విపాసన ధ్యాన కార్యక్రమాల కోసం ఉపయోగించేవారట. అలాగే ఆయుధాల వ్యాపారి అభిషేక్ వర్మ కూడా గతంలో ఇక్కడే ఉన్నారట. ఈ జైలు జీవితంలో వీరిద్దరూ ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కోరలేదు. అయితే, వారిలో ఒకరు మాత్రం తోటి ఒక తోటి ఖైదీని కలిసేందుకు అనుమతివ్వాలని జైలు అధికారులను మౌఖికంగా కోరాడట. ఆ విజ్ఞప్తిని అధికారులు తిరస్కరించినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Delhi-Tihar Jail: తీహార్ జైలులో సీజేపీ నేతలకు స్పెషల్ ట్రీట్మెంట్..
-
LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులెటిన్ విడుదల..
-
Janasena First List: 2 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలకు జనసేన అభ్యర్థులు ఖరారు.. తొలి జాబితా పూర్తి వివరాలు ఇవే
-
Naga Vamsi : భారీ రేట్లు చూసి భయపడ్డా కానీ దసరాకే లాభాల పంట.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Deva : రజనీ బాషా మ్యూజిక్ డైరెక్టర్ మృతి
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!