Pakistan: పాకిస్థాన్ ఆసియాకప్ గెలవకపోవడంతో ఆ దేశ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అయితే అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు రమీజ్ రాజా ఇండియన్ జర్నలిస్టుపై తన కోపాన్ని ప్రదర్శించాడు. ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై పాకిస్థాన్ ఓటమితో అభిమానులు నిరాశకు గురయ్యారు..మీరు వారికి ఏం సందేశం ఇస్తారంటూ ఇండియన్ జర్నలిస్ట్ అడగ్గా.. ‘నువ్వు కచ్చితంగా భారతీయుడివై ఉంటావ్. మా ఓటమి తర్వాత భారతీయులే సంతోషంగా ఉన్నారు’ అంటూ…