ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. తమ జట్టు అద్భుతంగా ఆడుతోందని సంజూ శాంసన్ అన్నాడు. టీమ్ మంచి ఫాంలో ఉందని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ వెల్లడించాడు. తొలుత బ్యాటింగ్ కు వచ్చిన రాజస్థాన్ బ్యాటర్లు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. యశస్వి జైశ్వాల్, జోస్ బట్లర్ లు తమ ఫామ్ ను కొనసాగించారు.
Also Read : Ponnam Prabhakar : మంత్రి గంగుల కమలాకర్‌కు పొన్నం ప్రభాకర్ సవాల్
ఐదో ఓవర్ బౌలింగ్ వేసేందుకు వచ్చిన మెరిడెత్ బౌలింగ్ లో జైశ్వాల్ తొలి బంతినే ఫోర్ గా మలిచాడు. రెండు, మూడో బంతిని మెరిడెత్ డట్ చేశాడు. 4.4 ఓవర్లలోనే 50 పరుగుల మార్క్ ను రాజస్థాన్ రాయల్స్ అందుకుంది. మెరిడెత్ వేసిన ఐదో ఓవర్ ( 16 పరుగులు ) ముగిసే సరికి రాజస్థాన్ స్కోర్ 58 పరుగులు చేసింది.
Also Read : Etela Rajender : కేసీఆర్ ప్రతిష్ట కోసమే కొత్త సచివాలయం
పీయూష్ చావ్లా బౌలింగ్‌లో జోస్ బట్లర్ భారీ షాట్‌కు యత్నించి రమన్‌దీప్ సింగ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 72 పరుగుల(7.1వ ఓవర్) వద్ద తొలి వికెట్ పడింది. 8 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 80/1గా ఉంది. అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో తిలక్ వర్మ క్యాచ్ పట్టుకోవడంతో రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ (14) ఔట్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ 95 పరుగులకే(9.5వ ఓవర్) వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది. 10 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 97/2గా ఉంది.
Also Read : Dhee Choreographer Chaitanya: బ్రేకింగ్.. ఆ బాధ తట్టుకోలేక ఢీ కొరియోగ్రాఫర్ ఆత్మహత్య
పీయూష్ చావ్లా బౌలింగ్‌లో(10.2వ ఓవర్) ఫోర్ కొట్టిన యశ్వసి జైశ్వాల్ 32 బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పీయూష్ చావ్లా వేసిన 10.5వ ఓవర్లో దేవదత్ పడిక్కల్ (2) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 103 పరుగుల(10.5వ ఓవర్) వద్ద రాజస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. 11 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 103/3గా ఉంది.
Also Read : ఇండియాలో మోస్ట్ బ్యూటిఫుల్ రైల్వేస్టేషన్లు ఇవే..
కామెరూన్ గ్రీన్ వేసిన 14వ ఓవర్లోని మూడో బంతికి జేసన్ హోల్డర్ ఓ సిక్స్ కొట్టగా.. ఆఖరి బంతికి జైశ్వాల్ ఫోర్ బాదీ పరుగుల వేట కొనసాగిస్తున్నాడు. దీంతో ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన జేసన్ హోల్డర్ ఇచ్చిన క్యాచ్ ను టిమ్ డేవిడ్ పట్టుకోవడంతో ఔట్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ 159 పరుకులకే ఐదు వికెట్ కోల్పోయింది. షిమ్రాన్ హెట్మెయర్(8) కొట్టిన బాల్ ను సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టుకోవడంతో ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్(85),ధ్రువ్ జువెల్ ఉన్నారు.