మంత్రి గంగుల కమలాకర్‌కు మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. ధాన్యం కొనుగోళ్లపై బహిరంగ చర్చకు వస్తారా అని ఆయన అన్నారు. ఆధారాలతో సహా నిరూపిస్తామని, కొన్నామని చెప్తున్నది ఎంత..? అసలు కొన్నది ఎంత..? అని ఆయన ప్రశ్నించారు. మీరు చెప్పిన కొనుగోలు కేంద్రానికే వెళ్దామని, రైతులు ఏడుస్తుంటే మీ అనుచరులు డాన్సులు చేస్తారా..? 11 జిల్లాల్లో ఒక్క మెట్రిక్ టన్ను ధాన్యమైనా కొనుగోలు చేశారా..? ధాన్యం కొనుగోళ్లపై మంత్రి గంగుల కమలాకర్ కు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు ధాన్యం కొనుగోళ్లలో మంత్రి గంగుల కమలాకర్ చెప్తున్నది అవాస్తవాలే అని విమర్శించారు.
Also Read : Gayathri Rao: హ్యాపీ డేస్ లో నిఖిల్ లవర్ అప్పు.. అయ్యబాబోయ్..ఇప్పుడేంటి ఇలా ఉంది
11 జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క ధాన్యపు గింజను కూడా కొనుగోలు చేయలేదని ఆక్షేపించారు. ఆరు జిల్లాల్లో 1 మెట్రిక్ టన్నులలోపు, ఎనిమిది జిల్లాల్లో 2 వేల మెట్రిక్ టన్నులలోపు మిగతా ఏడు జిల్లాల్లో నిజామాబాద్‌లో 1 లక్షా 50 వేల 16 మెట్రిక్ టన్నులు, కామారెడ్డిలో 26,042 మెట్రిక్ టన్నులు, జనగాం జిల్లాలో 3,696 మెట్రిక్ టన్నులు, ఖమ్మంలో 8,198 మెట్రిక్ టన్నులు, నల్గొండ జిల్లాలో 1,59,040 మెట్రిక్ టన్నులు, సూర్యాపేటలో 52,702 మెట్రిక్ టన్నులు, వనపర్తి జిల్లాలో 14,816 మెట్రిక్ టన్నులు, కరీంనగర్ జిల్లాలో కేవలం 2,267 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు జరిగిందని చెప్పారు.
Also Read : Akhil Akkineni: అఖిల్ కు ఆ దోషం ఉంది.. ఆమె మాట వింటే..వేణుస్వామి సంచలన కామెంట్స్