టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు కింగ్స్ సెకండ్ ఓవర్ లోనే పెద్ద షాక్ తగిలింది. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో రిలీ రోసో క్యాచ్ అందుకోవడంతో కెప్టెన్ శిఖర్ ధావన్ (7) ఔట్ అయ్యాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 10 పరుగులకే(1.2వ ఓవర్) తొలి వికెట్ కోల్పోయింది. శిఖర్ ధావన్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన లివింగ్ స్టోన్ ( 4 )ను కూడా ఇషాంత్ శర్మ క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. తమ జట్టు అద్భుతంగా ఆడుతోందని సంజూ శాంసన్ అన్నాడు.