Punjab Kings Won The Toss And Chose To Field: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (హెచ్‌పీసీఏ) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో బ్యాటింగ్ చేసేందుకు డీసీ రంగంలోకి దిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆల్రెడీ ఫ్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. కానీ.. పంజాబ్ కింగ్స్‌కి మాత్రం ఇప్పటికే ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. ఇప్పుడు డీసీతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 22+ బంతుల మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేధించగలిగితే.. ముంబై ఇండియన్స్‌ని వెనక్కు నెట్టేసి, నాలుగో స్థానానికి ఎగబాకే అవకాశం ఉంది. పంజాబ్ జట్టు రన్ రేట్ నెగెటివ్‌లో ఉంది కాబట్టి, ప్లేఆఫ్స్‌లో దూసుకెళ్లాలంటే ఆ జట్టు భారీ తేడాతో మ్యాచ్ నెగ్గాల్సి ఉంటుంది. అలా కాకుండా ఢిల్లీ చేతిలో ఓడిపోతే మాత్రం.. ఇంటిదారి పట్టక తప్పదు. ఈ లెక్కన.. పంజాబ్ జట్టుకి ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన మ్యాచ్. మరి, ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఎలా రాణిస్తుందో చూడాలి.
Bride Left Wedding Ceremony: మూడు ముళ్లు పడగానే.. పెళ్లి పీటలపై నుంచి వెళ్లిపోయిన వధువు

ఇదివరకే ఈ రెండు జట్లు మే 13వ తేదీన తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై పంజాబ్ జట్టు విజయఢంకా మోగించింది. ఏకంగా 31 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత పంజాబ్ జట్టు 167 పరుగులు చేయగా.. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డీసీ కేవలం 136 పరుగులకే పరిమితం అయ్యింది. ఇప్పుడు అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని డీసీ భావిస్తోంది. ఆల్రెడీ ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించడాన్ని అవమానంగా తీసుకున్న డీసీ.. కనీసం మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా మంచి ప్రదర్శన కనబర్చాలని చూస్తోంది. తనతో పాటు ఇతర జట్లను కూడా ఇంటిదారి పట్టించాలని భావిస్తోంది. మరి.. హోరాహోరీగా జరగబోయే ఈ మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో? డీసీపై నెగ్టి పంజాబ్ తన ప్లేఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంటుందా? లేక డీసీ చేతిలో ఓడి ఇంటిదారి పడుతుందా? మరికొన్ని గంటల్లోనే ఆ ఫలితం తేలిపోనుంది.
బికినీలో బ్యాక్ చూపిస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. బాలయ్య, నాగ్ లతో నటించింది కూడా ?