Pro Kabaddi League: క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రొ కబడ్డీ లీగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రొ కబడ్డీ లీగ్ తొమ్మిదో సీజన్ అక్టోబర్ 7, 2022న ప్రారంభమై డిసెంబర్ మధ్యకాలం వరకు కొనసాగనుంది. లీగ్ దశ బెంగళూరు, పూణె, హైదరాబాద్‌లలో జరగనుంది. రాబోయే తొమ్మిదో సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ఆగస్ట్ 5, 6 తేదీలలో నిర్వహించబడింది, ఈవెంట్ నిర్వాహకులు మషాల్ స్పోర్ట్స్ మీడియా ప్రకటనలో తెలిపారు.
Movie on education system: ‘వెల్కమ్ టు తీహార్ కాలేజ్’ అంటున్న సునీల్ కుమార్ రెడ్డి!
పీకేఎల్ సీజన్ 9 ప్రకటనపై మషాల్ స్పోర్ట్స్ అండ్ లీగ్ కమీషనర్, స్పోర్ట్స్ లీగ్స్ హెడ్ అనుపమ్ గోస్వామి మాట్లాడుతూ.. “మాషాల్ స్పోర్ట్స్ స్వదేశీ క్రీడను దృష్టిలో ఉంచుకుని ప్రొ కబడ్డీ లీగ్ ప్రయాణాన్ని ప్రారంభించింది. సమకాలీన, రాబోయే తరాల క్రీడాభిమానులను దృష్టిలో ఉంచుకుని ఈ క్రీడలను నిర్వహిస్తున్నాం. నిర్వహించిన ప్రతిసారి విజయాన్ని సాధిస్తూనే ఉన్నాం. ఈ ఏడాది ప్రారంభంలో ప్రొ కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్‌ను సమగ్ర బయోబబుల్‌లో నిర్వహించాం. ఇప్పుడు రాబోయే సీజన్ గురించి మరింత ఉత్సాహంగా ఉన్నాం. అభిమానులు తమ అభిమాన జట్లు, స్టార్ ఆటగాళ్ల క్రీడను ఆస్వాదిస్తారు.” అని అన్నారాయన.