Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl 2026 Pbks Vs Dc Punjab Kings 211 Target Shreyas Priyansh

PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!

Published Date :May 11, 2026 , 9:45 pm
By Gogikar Sai Krishna
  • ప్రియాన్ష్ ఆర్య హాఫ్ సెంచరీతో పంజాబ్ దూకుడు
  • కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అజేయ ఫిఫ్టీ
  • స్టార్క్‌కు చుక్కలు చూపించిన పంజాబ్ బ్యాటర్లు
  • ధర్మశాలలో 200+ ఛేజ్ చేస్తేనే ఢిల్లీకి చాన్స్
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

PBKS vs DC : ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ బ్యాటర్లు శివతాండవం ఆడారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసిన పంజాబ్, ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ధర్మశాల పిచ్‌పై బౌలర్లకు కొంత సహకారం ఉన్నప్పటికీ, పంజాబ్ బ్యాటర్లు అద్భుతమైన హిట్టింగ్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్‌ను ప్రియాన్ష్ ఆర్య మెరుపు వేగంతో ప్రారంభించాడు. ముఖ్యంగా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ వేసిన మొదటి ఓవర్‌లోనే ప్రియాన్ష్ విరుచుకుపడి 22 పరుగులు రాబట్టాడు. పవర్ ప్లే ముగిసేసరికి పంజాబ్ వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ప్రియాన్ష్ 33 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 56 పరుగులు చేసి మాధవ్ తివారి బౌలింగ్‌లో అవుటయ్యాడు. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (18) ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.

Also Read

  • ICC ODI Rankings: టీమిండియా 'వన్డే' జైత్రయాత్ర.. ప్రపంచ ఛాంపియన్లనే వెనక్కి నెట్టి అగ్రస్థానంలో భారత్!
  • Tim David: ఎందుకు బ్రో అంత కోపం.. RCB విజయంతో టిమ్ డేవిడ్ ఆ వేళ్లు చూపిస్తూ.!
  • Bhuvneshwar Kumar: స్వింగ్ కింగ్ 'భూవీ' ఈజ్ బ్యాక్.. టీమిండియాకు రీఎంట్రీ ఖాయమేనా..!
  • చైనాకు షాక్ ఇచ్చిన భారత మహిళల ఆర్చరీ జట్టు.. Archery World Cup 2026లో స్వర్ణ పతకం కైవసం.!
Add as a preferred
source on google

ఓపెనర్లు అవుటైన తర్వాత ఇన్నింగ్స్ బాధ్యతను కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ భుజానికెత్తుకున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా తడబడకుండా ఆడిన అయ్యర్, 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి కూపర్ కానలీ (38) నుంచి మంచి సహకారం లభించింది. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇన్నింగ్స్ చివర్లో సూర్యాంశ్ షెడ్జ్ కేవలం 8 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 21 పరుగులు చేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.

ఢిల్లీ బౌలర్లలో యువ బౌలర్ మాధవ్ తివారి ఆకట్టుకున్నాడు. తన 4 ఓవర్లలో 40 పరుగులిచ్చి ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కానలీ వంటి కీలక వికెట్లను పడగొట్టాడు. సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ 19వ ఓవర్‌లో స్టోయినిస్, శశాంక్ సింగ్‌లను వరుస బంతుల్లో అవుట్ చేసి పంజాబ్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. అయితే, స్టార్క్ తన 4 ఓవర్లలో ఏకంగా 57 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. ముఖేష్ కుమార్ (1/31) పొదుపుగా బౌలింగ్ చేయగా, లుంగి ఎంగిడి ధారాళంగా పరుగులు ఇచ్చాడు.

ధర్మశాల వేదికగా ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఏ జట్టు కూడా 200 పైచిలుకు స్కోరును ఛేజ్ చేయలేదు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ఆ రికార్డును తిరగరాస్తేనే టోర్నీలో తమ అవకాశాలను సజీవంగా ఉంచుకోగలదు. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగుతున్న ఢిల్లీ బ్యాటర్లు.. పంజాబ్ బౌలర్లను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ముఖ్యంగా మంచు ప్రభావం (Dew) ఉండటంతో బంతి స్కిడ్ అయ్యే అవకాశం ఉందని, ఇది బ్యాటర్లకు కలిసి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cricket news
  • delhi capitals
  • IPL 2026
  • IPL Live Score
  • PBKS vs DC

తాజావార్తలు

  • PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!

  • Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్

  • Bank Holidays: ఈ వారం బ్యాంకుల సెలవుల లిస్ట్ ఇదే.. ఓ లుక్కేయండి!

  • CM Chandrababu : భారత్ పారిశ్రామిక వృద్ధిలో సీఐఐ పాత్ర కీలకం

  • Vishwambhara: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్? ఎప్పుడంటే..

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions