Shreyas Iyer: టీ20 ఫార్మాట్‌తో జరగబోతున్న ఆసియా కప్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఇప్పటికే జట్టును ప్రకటించింది. అందులో శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం లభించలేదు. సూర్యకుమార్ యాదవ్‌కు డిప్యూటీగా శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేసింది. అయితే, ఇటీవల అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచినా శ్రేయస్‌కు మొండిచేయి ఎదురు కావడంతో.. బీసీసీఐ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాగా, తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పటి వరకూ 3 ఫార్మాట్లకు ఒకే సారథిని ఎంపిక చేద్దామని అనుకున్న టీమిండియా మేనేజ్‌మెంట్ ఇప్పుడు పునరాలోచనలో పడినట్లు సమాచారం.
Read Also: Bedroom : మీ బెడ్‌రూంలో దాగి ఉన్న ప్రమాదం.. వెంటనే పారేయాల్సిన 3 ముఖ్యమైన వస్తువులు !
అయితే, ప్రస్తుతం భారత టెస్టు జట్టుకు కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. ఇక, టీ20లకు సూర్యకుమార్ యాదవ్.. వన్డేలకు రోహిత్ శర్మ నాయకత్వ బాధ్యతలను చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు గిల్‌ను పొట్టి ఫార్మాట్‌కు వైస్ కెప్టెన్‌గా చేయడంతో రాబోయే రోజుల్లో అతడికే జట్టు పగ్గాలు అప్పగిస్తారనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మ వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకూ ఆడాలనే టార్గెట్ తో ఉండగా.. అతడ్ని కెప్టెన్సీ నుంచి తప్పించి శ్రేయస్‌ను వరల్డ్ కప్ 2027 వరకూ నియమిస్తారనే ప్రచారం కొనసాగుతుంది. ఆ తర్వాత కూడా గిల్‌ను ఏకైక సారథిగా చేసే అవకాశం లేదని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read Also: Writer’s Room : ఇండస్ట్రీలో రాణించాలనుకునే వారికి అద్భుత అవకాశం
ప్రస్తుతం రోహిత్ శర్మకు 38 ఏళ్లు.. ప్రపంచకప్ నాటికి అతడికి 40+ అవుతుంది. దీంతో గిల్‌కే జట్టు బాధ్యతలు అప్పగించాలని మొదటి టీమిండియా మేనేజ్‌మెంట్ అనుకుంది. కానీ, వర్క్‌లోడ్‌తో అతడి ప్రదర్శనపై తీవ్ర ప్రభావం పడుతుందేమో అనే ఆందోళన మొదలైంది. దీంతో వన్డేలకు రోహిత్ బదులు శ్రేయస్‌ను కెప్టెన్ గా నియమిస్తే బాగుంటుందనే వాదనా ప్రస్తుతం తెర పైకి వచ్చినట్లు సమాచారం. ఆసియా కప్ తర్వాత సెలక్షన్ కమిటీ మరోసారి సమావేశమై రోహిత్, విరాట్ భవితవ్యంపై నిర్ణయం తీసుకుని.. శ్రేయస్‌కు టీమిండియా వన్డే జట్టు పగ్గాలు అందజేస్తారని ప్రసారం జరుగుతుంది.