ఇండస్ట్రీలోకి కొత్త నీరు రావాలని చాలా మంది అంటుంటారు. కొత్త వారు వచ్చినప్పుడు.. కొత్త కథా రచయితలు, దర్శకులు వచ్చిప్పుడు మరింత కొత్త కథలు పుట్టుకొస్తుంటాయి. అందుకే న్యూ టాలెంట్ హంట్‌ను ZEE నిర్వహిస్తోంది. కథా రచయితలు, దర్శకుల కోసం ZEE టీం ఆడిషన్స్ నిర్వహిస్తోంది. ఒరిజినల్ సిరీస్‌లు, కొత్త కంటెంట్, అద్భుతమైన చిత్రాలతో ZEE5 ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో కొత్త టాలెంట్ కోసం ZEE5 టీం కొత్త ఆలోచనను తీసుకు వచ్చింది.
Also Read : MLA VS FANS : NTR ఫ్యాన్స్ మెంబర్ ధనుంజయ నాయుడుకు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ బెదిరింపు కాల్స్
ఇక ZEE5 టీం న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ZEE రైటర్స్ రూం అంటూ ఆగస్ట్ 30న ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. ఓటీటీ, ఫిల్మ్, టీవీ ఇలా ఏ ఫ్లాట్‌ఫాంకి అయినా సరే కొత్త కొత్త కథల్ని అందించాలని అనుకునే వారికి ZEE5 టీం అవకాశం కల్పిస్తోంది. ఇండస్ట్రీలోకి రావాలని అనుకునే వారికి, తమ కథల్ని ప్రపంచానికి చాటిచెప్పాలని అనుకునే కొత్త వారికి ZEE సంస్థ సదావకాశాన్ని కల్పిస్తోంది. హైదరబాద్‌లో ఈ ఆడిషన్‌ను నిర్వహిస్తున్నారు. సారథి స్టూడియో ఎదురుగా మెట్రో స్టేషన్ సమీపంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఈ ఆడిషన్స్ జరుగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ ఆడిషన్స్ నిర్వహించనున్నారు. మరిన్ని వివరాల కోసం ZEE5ని సంప్రదించగలరు. కొత్త వారికి ఇదొక అద్భుతమైన అవకాశం. ఈ న్యూ టాలెంట్ రానున్న తరాన్ని, సినిమా కథల్ని మలిచే తీరుని మార్చగలరు. డిఫరెంట్ కంటెంట్‌తో కొత్త వారు ఇక్కడ అద్భుతాలు సృష్టించవచ్చు. మీలో ఆ టాలెంట్ ఉంటె ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.