టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ ఇప్పటికే పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలైంది. అయితే ఆ జట్టుకు పుండు మీద కారం చల్లిన మాదిరిగా మరో షాక్ తగిలింది. న్యూజిలాండ్ జట్టు ప్రధాన పేసర్ ఫెర్గూసన్ టీ20 ప్రపంచకప్ మొత్తానికి దూరమయ్యాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్ ముందే అతడు కాలి గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అతడికి ఎంఆర్ఐ స్కాన్ తీయగా ఫ్రాక్చర్ అని తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఫెర్గూసన్‌కు విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేయగా న్యూజిలాండ్ బోర్డు ప్రపంచకప్ నుంచి అతడిని తప్పించింది.
Read Also: టీ20 ప్రపంచకప్ : పాక్ మరో విజయం
దీంతో న్యూజిలాండ్ జట్టు 15 మంది సభ్యుల జాబితాలో సెలక్టర్లు ఫెర్గూసన్ బదులు ఆడమ్ మిల్నేను తీసుకున్నారు. మరోవైపు న్యూజిలాండ్ టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరాలంటే టీమిండియాతో జరిగే మ్యాచ్‌లో తప్పకుండా విజయం సాధించాలి. ఈనెల 31న భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య అమీతుమీ జరగనుంది. ఈ మ్యాచ్ న్యూజిలాండ్ జట్టుకే కాదు… టీమిండియా కూడా చాలా ముఖ్యమే. ఎందుకంటే భారత్ కూడా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. గ్రూప్-2లో భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్ కాకుండా మిగతా మూడు జట్లు బలహీనమైన జట్లు ఉన్నాయి. అవి ఆప్ఘనిస్తాన్, స్కాట్లాండ్, నమీబియా. వాటిపై గెలవడం అంత కష్టం కాదు కాబట్టి భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. దీంతో ఈ మ్యాచ్ రెండు జట్లకు చావోరేవో వంటిదని చెప్పాలి.