ఆరోగ్యమే మహా భాగ్యం. మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదు. అందుకే ప్రస్తుతం అందరూ ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ద వహిస్తున్నారు. పోషకాహారం తీసుకోవడంతో పాటు, వ్యాయామాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా తీసుకునే ఆహరం విషయంలో బలమైన ఆహరం తీసుకోవాలని చూస్తూ ఉన్నారు. మాంసాహారం, శాఖాహారం, మొలకెత్తిన గింజలు, పండ్లు, పాలు వంటి వాటిని ఆహారంలో చేర్చచుకుంటున్నారు. వాటిలో ఇప్పుడు చిరుధాన్యాలకు ప్రాధాన్యత పెరుగుతుంది.
Also Read:SAMSUNG Galaxy F05: రూ. 10 వేల స్మార్ట్ ఫోన్ రూ. 6 వేలకే.. త్వరపడండి
చిరుధాన్యా్ల్లో జొన్నలు ఒకటి. వీటిలో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. శరీరాన్ని ఫిట్ గా ఉంచడంలో జొన్నలు సహాయపడతాయి. వీటిలో అనేక రకాల ఫైబర్లు , విటమిన్లు , పోషకాలు లభిస్తాయి. గోధుమల కంటే కూడా జొన్నలు తినడం వలన చాలా లాభాలు కలుగుతాయి. బరువు తగ్గించడంతో పాటు.. జీర్ణ క్రియ మెరుగుపరచడంలో కూడా తోడ్పడుతుంది. దీనిలో గ్లూటెన్ ఉండదు.. కానీ అధిక మొత్తంలో కాల్షియం లభిస్తుంది.
Also Read:Delhi New CM : ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తా.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే
అలాగే దీనిని తినడం వలన ఎముకలు దృఢంగా మారుతాయి. ఇక వీటిని తీసుకోవడం వలన గుండె సంబంధిత వ్యాధులు కూడా దూరం అవుతాయి. అంతే కాకుండా రక్త ప్రసరణను పెంచడంతో పాటు.. చర్మ వ్యాధులు రాకుండా నివారిస్తుంది. ఇప్పుడు ఎలాగూ జొన్నలతో నోటికి రుచిగా ఉండే రకరకాల ఫుడ్స్ ను తయారు చేస్తూనే ఉన్నారు. కాబట్టి జొన్నలను రెగ్యులర్ డైట్ లో యాడ్ చేసుకుంటే ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు.