టాలీవుడ్ లో అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన హీరోలలో మెగా హీరోలు ఒకరు. మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ సినిమాలు రిలీజ్ అయితే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంత కాదు. మెగా ఫ్యాన్స్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు, అందుకు కారణాలు లేకపోలేదు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే ఇటీవల మెగాస్టార్ కు భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పేరుతో సత్కరించింది. ఎందరో మహామహులకు దక్కిన ఈ గౌరవం మెగాస్టార్ కు రావడం పట్ల మెగాభిమానులు ఖుషిగా ఉన్నారు.
Also Read : NBK 109 : ‘డాకు మహారాజ్’ ఫస్ట్ లిరికల్ సాంగ్.. ఫ్యాన్స్ కు పూనకాలే.!
ఇక మెగాహీరోలలో మరొక హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన సినిమా విడుదల అవుతుందంటే ఫ్యాన్స్ తో పాటు సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదుచూస్టారు. అలంటి పవర్ స్టార్ట్ రాజకీయాల్లో అడుగుపెట్టి 2024లో జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నుండి ఎమ్మెల్యే గా గెలవడమే కాకుండా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా భాద్యతలు నిర్వహిస్తున్నారు. ఇక తాజాగా మెగా బ్రదర్స్ లో ఒకరైన సినీ హీరో కొణిదెల నాగబాబుకు మంత్రి పదవి వరించింది. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన స్థాపించిన నాటి నుండి ఎంతగానో కస్టపడి ఏ పదవి ఆశించంకుండా వెనకనుండి నడిపించిన నాగబాబుకు జనసేన తరపున మంత్రి పదవీ రావడంతో మెగా ఫ్యాన్స్ జోష్ లో ఉన్నారు. ఒకే ఫ్యామిలీ నుండి పద్మ విభూషణ్, డిప్యూటీ సీఎం, మంత్రి కావడం పట్ల మెగా ఫ్యాన్స్ కి ఇంతకన్నా ఆనందం ఏముంటుంది.