Chennai Super Kings vs Lucknow Super Giants Match Abandoned Due To Rain: లక్నోలోని ఏకన స్పోర్ట్స్ సిటీ స్టేడియం వేదికగా.. లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ రద్దు అయ్యింది. ఏకధాటిగా వర్షం కురవడం వల్లే ఈ మ్యాచ్‌ని రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో.. ఇరు జట్లకి చెరో పాయింట్ కేటాయించారు. తొలుత చిరుజల్లలు పడటంతో.. కాసేపట్లోనే వర్షం ఆగిపోవచ్చని అంచనా వేశారు. ఒకవేళ కాస్త ఆలస్యంగా ఆగినా.. డక్‌వర్త్ లూయిస్ విధానంలో మ్యాచ్ కొనసాగించాలని నిర్ణయించారు. కానీ.. ఎంతసేపటికీ వర్షం ఆగకపోవడంతో, చివరికి మ్యాచ్‌ని రద్దు చేసేశారు.
Russia-Ukraine War: పుతిన్‌పై హత్యాయత్నం!.. ప్రతీకారం తీర్చుకుంటామని రష్యా హెచ్చరిక

అంతకుముందు.. చెన్నై జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో, లక్నో జట్టు బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. ఇది బౌలింగ్ పిచ్ కావడం, ముఖ్యంగా స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో.. చెన్నై బౌలర్లు చెలరేగిపోయారు. తమ స్పిన్ మాయాజాలంతో లక్నో బ్యాటర్లను గందరగోళానికి గురి చేసి, వరుస వికెట్లు తీశారు. కైల్ మేయర్స్ (14), స్టోయినిస్ (6), పూరన్ (20) వంటి స్టార్ బ్యాటర్లు సైతం చెన్నై బౌలర్ల ధాటికి చేతులెత్తేశారు. లక్నో పతనం చూసి.. ఈ జట్టు 100 పరుగుల మైలురాయిని అందుకోవడం కష్టమేనని భావించారు. కానీ.. యువ ఆటగాడైన బదోని మాత్రం ఒంటరి పోరాటం కొనసాగించి, తన జట్టుని ఆదుకున్నాడు. హేమాహేమీలు సైతం ఎదుర్కోలేని చెన్నై బౌలర్లను అతడు సింగిల్ హ్యాండెడ్‌గా ఎదుర్కున్నాడు.
MS Dhoni: రిటైర్మెంట్‌పై ధోనీ స్పందన.. మీరే నిర్ణయించుకున్నారంటూ క్లారిటీ
మొదట్లో క్రీజులోకి అడుగుపెట్టినప్పుడు ఆచితూచి ఆడిన అతగాడు.. ఆ తర్వాత చెన్నై బౌలర్ల ప్రణాళికల్ని పసిగట్టి, విజృంభించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే అతడు అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. 33 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్స్‌ల సహకారంతో 59 పరుగులు చేశాడు. ఇతని పుణ్యమా అని.. లక్నో స్కోరు 100 పరుగులు మార్క్‌ని దాటేసింది. అయితే.. ఇంతలోనే వర్షం షాకిచ్చింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి లక్నో స్కోరు 19.2 ఓవర్లలో 125/7 గా నమోదైంది. చెన్నై బౌలర్లలో పతిరానా, తీక్షణ, మోయిన్ అలీ తలా మూడు వికెట్లు తీయగా.. జడేజా ఒక వికెట్ పడగొట్టాడు.