Mohammed Rizwan: భారత్ తో మాకు ఆడాలనివున్నా, మమ్మల్ని ఆడనివ్వరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్,పాక్ మ్యాచ్ అంటేనే యుద్ధాన్ని తలిపిస్తుంది. ప్రతి బంతికి ఆధిపత్యం మారుతూ, నరాలు తెగే ఉత్కంఠ ను రేపుతోంది. అయితే భారత్,పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యములో కేవలం ICC టోర్నమెంట్‌లోనే ఈ దాయాదుల పోరును చూడాల్సివస్తోంది. అయితే భారత్, పాకిస్థాన్ జట్ల ప్లేయర్లు ఇండియా – పాక్ మ్యాచ్‌లు జరగాలని, అందులో తాము కూడా ఆడాలని కోరుకుంటున్నారని పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్ పేర్కొన్నాడు. కానీ ఇరు దేశాల మధ్య రాజకీయ సమస్యల కారణంగా అది కుదరడం లేదని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. టీమిండియా, పాకిస్తాన్ 2014 తర్వాత మళ్లీ ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడలేదు. 2014లో పాకిస్తాన్ ఇండియా పర్యటనకు వచ్చి అప్పట్లో రెండు టీ20లు, మూడు వన్డే సిరీస్‌లు ఆడింది. ఇక ఆ తర్వాత పాక్, ఇండియా మధ్య సిరీస్‌లు జరగలేదు.
ఇకపోతే కేవలం ICC టోర్నీల్లో అప్పుడప్పుడు ఇండియా, పాక్ తలపడుతున్నాయి. గతేడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్లలో జరిగిన T20ప్రపంచకప్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతగా బాగా లేనందున ఇరువైపులా పర్యటనలు జరగడం అసంభవమనే చెప్పాలి.
Also Read
- Shreyas Iyer: వాంఖడే స్టేడియంలో శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్.. మొదటి విజయం నమోదు..
- RCB Player: అభిమానులకు బిగ్‌షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
- Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
- Test Match: ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్‌నెస్‌పై కోచ్ కీలక వ్యాఖ్యలు
అయితే ఇందులో భాగంగానే రిజ్వాన్ మాట్లాడుతూ.. “పాకిస్తాన్, ఇండియా క్రికెటర్లు కలిసి మ్యాచ్‌లు ఆడాలని కోరుకుంటారు, కానీ దేశస్థాయిలోని రాజకీయ వ్యవహారాల వల్ల పాక్, ఇండియా మ్యాచ్‌లు జరగట్లేవు. అలాగే ఈ వ్యవహారాలను సద్దుమణించడం ప్లేయర్ల చేతిలో లేవు” అని వెస్టిండీస్ పర్యటనకు ముందు రిజ్వాన్ మీడియాతో అన్నాడు.
ఇకపోతే రిజ్వాన్ పుజారా గురించి మాట్లాడుతూ.. “క్రికెట్‌కు సంబంధించి చాలా విషయాలు నేను పుజారాతో చర్చించాను. అతని నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆటగాళ్లుగా మాకు తేడా లేదు, మాది క్రికెట్ కుటుంబం. పుజారా చాలా మంచి వ్యక్తి. నేను అతని ఏకాగ్రతను, ఫోకస్‌ను ఇష్టపడతాను. యూనిస్ ఖాన్, ఫవాద్ ఆలం, పూజారా ముగ్గురు నా ఉద్దేశం ప్రకారం ఓ లెజెండరీ ప్లేయర్లు’ అని రిజ్వాన్ పేర్కొన్నాడు. ఇటీవల కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో వీరిద్దరు ఒకే జట్టు ససెక్స్‌కు ఆడిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!