Joe Root was stumped for the first time in Tests after 11168 Runs: ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టు కెరీర్‌లో 11 వేలకు పైగా పరుగులు చేసిన అనంతరం తొలిసారి స్టంప్ ఔట్ అయ్యాడు. యాషెస్ సిరీస్ 2023లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రూట్ స్టంపౌట్ అయ్యాడు. దాంతో 11 వేలకు పైగా పరుగులు చేసి.. తొలిసారి స్టంప్ ఔట్ అయిన రెండో ఆటగాడిగా నిలిచాడు. రూట్ తన టెస్టు కెరీర్‌లో స్టంపౌట్ అవ్వడం ఇదే తొలిసారి.
జో రూట్ తన కెరీర్‌లో 130 టెస్టులాడి 11,168 పరుగులు చేసిన అనంతరం మొదటిసారి స్టంపౌట్ అయ్యాడు. దాంతో ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో వెస్టిండీస్ మాజీ ఓపెనర్ శివనారాయణ్ చందర్‌పాల్ 11,414 పరుగులు చేసిన తర్వాత తొలిసారి స్టంపౌట్ అయ్యాడు. మూడో స్థానంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఉన్నాడు. స్మిత్ 8800 పరుగులు చేసిన తర్వాత స్టంపౌట్ అయ్యాడు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 8195 పరుగులు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 7419 పరుగులు చేసిన తర్వాత స్టంపౌట్ అయి 4, 5 స్థానాల్లో ఉన్నారు.
ఐతే టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసి ఒక్కసారి కూడా స్టంపౌట్ కాని ఆటగాడిగా శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దేనే రికార్డుల్లో ఉన్నాడు. టెస్టుల్లో 11,814 పరుగులు చేసిన జయవర్దనే.. ఒక్కసారి స్టంపౌట్ కాకపోవడం విశేషం. జో రూట్ కూడా దాదాపుగా జయవర్దనే వద్దకు వచ్చాడు. 600లకు పైగా పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఓ క్రికెటర్ ఇన్ని పరుగులు చేసి కూడా స్టంపౌట్ కాలేదంటే అతడు ఎంత సంశయనంతో క్రీజులో ఉన్నాడో ఇట్టే అర్ధమవుతుంది.
ఎక్కువ రన్స్ చేసి స్టంపౌట్ కాని ప్లేయర్స్ లిస్ట్:
11,414: శివ చంద్రపాల్
11,168: జో రూట్
8,800: గ్రేమ్ స్మిత్
8,195: విరాట్ కోహ్లీ
7,419: సచిన్ టెండూల్కర్
Also Read: Ashes 2023: రసవత్తరంగా యాషెస్ తొలి టెస్ట్.. ఆస్ట్రేలియాకు 174 రన్స్, ఇంగ్లండ్‌కు 7 వికెట్లు!