ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఉప్పు, నిప్పులా ఉండే ఆర్సీబీ క్రికెటర్ విరాట్ కోహ్లీ, కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ కలిసిపోయారు. బెంగళూరు, కోల్ కతా మ్యాచ్ సందర్భంగా వీరిద్దరూ ఆలింగనం చేసుకున్నారు. టైమ్ ఔట్ సమయంలో గంభీర్ గ్రౌండ్ లోకి వచ్చి కోహ్లీని హత్తుకున్నారు. దీంతో స్టేడియంలోని అభిమానులంతా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పిక్ ఆఫ్ ది డే, పిక్ ఆఫ్ ది టోర్నీ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. గంభీర్, కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Nikhil Siddharth: టీడీపీలో చేరిన పాన్ ఇండియా హీరో అంటూ వార్తలు.. ఇంతలో ట్విస్టు!
కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య వైరం ఉన్న సంగతి తెలిసిందే. నవీన్ ఉల్ హక్ వల్ల ఈ గొడవ గతేడాది మరింత ముదిరింది. గతేడాది లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్.. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీతో గొడవపడ్డాడు. తమ ప్లేయర్ నవీన్ ఉల్ హక్‌పై కోహ్లీ స్లెడ్జింగ్ దిగడాన్ని తప్పుబట్టిన గంభీర్.. మ్యాచ్ అనంతరం కోహ్లీతో గొడవపడ్డాడు. ఐపీఎల్ 2023 సీజన్లోనే ఈ ఘటన అత్యంత వివాదాస్పదంగా నిలిచిపోయింది. కానీ గంభీర్.. ఓ అడుగు వెనుకేసి కోహ్లీతో స్నేహానికి తెరలేపాడు. గత సీజన్లో కోహ్లీతో గొడవ పడిన నవీన్ ఉల్ హక్ సైతం.. కోహ్లీతో రాజీ కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
Virat Kohli and Gautam Gambhir hugging and smiling together at Chinnaswamy.
– VIDEO OF THE DAY. ❤️ pic.twitter.com/AiD5U6P8GI
— Tanuj (@ImTanujSingh) March 29, 2024