ఐటీ శాఖ నోటీసులపై కాంగ్రెస్ అగ్ర నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆర్థికంగా ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఐటీ నోటీసులపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తీవ్రంగా స్పందించారు. ఈడీ, ఆదాయపు పన్ను వంటి కేంద్ర శాఖలు బీజేపీ ఆదేశాల మేరకే పని చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం మారినప్పుడు ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నవారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు. మళ్లీ ఇలా చేయడానికి ఎవరూ ధైర్యం చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటామని.. ఇది తన హామీ అని తన అధికారిక ఎక్స్ ఖాతాలో రాహుల్ పోస్టు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి ఐటీ విభాగం శుక్రవారం మరోసారి నోటీసులు జారీ చేసింది. రూ.1,823 కోట్లు చెల్లించాలని కాంగ్రెస్‌కు ఐటీ నోటీసు రావడంపై పార్టీ మండిపడింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా కుంగదీసేందుకు బీజేపీ ఇలాంటి కుట్రలు పన్నుతోందని మండిపడింది. 2017-18, 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు ఐటీ రూ.1,823 కోట్ల డిమాండ్ నోటీసులు ఇచ్చినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. తమపై ఐటీ విభాగం ప్రక్రియను నిలిపివేయాలని పార్టీ వేసిన పిటిషన్‌ను గురువారం హైకోర్టు కొట్టేసిన వెంటనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఇది కూడా చదవండి: Maharashtra Death Mystery: సెల్ఫీ వీడియోతో డెత్ మిస్టరీ ఛేదింపు.. ఎలా అంటే..!
ఐటీ నోటీసలుపై సుదీర్ఘ న్యాయపోరాటానికి కాంగ్రెస్ సిద్ధమవుతోందని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా బీజేపీ వేలాది మంది నుంచి విరాళాలు పొందిందని, వారి ఆదాయపు పన్నును కూడా లెక్కించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఐటీ నోటీసులపై శనివారం దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలకు అధిష్టానం పిలుపునిచ్చింది. పీసీసీ కార్యాలయాల దగ్గర.. జిల్లా కార్యాలయాల దగ్గర ఆందోళనలు చేపట్టాలని కేసీ. వేణుగోపాల్ కోరారు.
ఇది కూడా చదవండి: Chandrababu: వింజమూరు ‘ప్రజాగళం’ సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
जब सरकार बदलेगी तो ‘लोकतंत्र का चीरहरण’ करने वालों पर कार्रवाई ज़रूर होगी!
और ऐसी कार्रवाई होगी कि दोबारा फिर किसी की हिम्मत नहीं होगी, ये सब करने की।
ये मेरी गारंटी है।#BJPTaxTerrorism pic.twitter.com/SSkiolorvH
— Rahul Gandhi (@RahulGandhi) March 29, 2024