Nikhil Siddharth Joined TDP News:’హ్యాపీడేస్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన స్టార్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు పొందిన నిఖిల్ ఇప్పుడు ‘స్వయంభూ’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. హీరో నిఖిల్ సిద్ధార్థ్ యాదవ్ తెలుగుదేశం పార్టీ లో చేరారు. ఈమేరకు ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఇక నిఖిల్ చేరుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నిఖిల్ మామయ్య కొండయ్య యాదవ్ కి టీడీపీ చీరాల టికెట్ కేటాయించింది. దీంతో నిఖిల్ కూడా ఈమేరకు ట్వీట్ చేసి తన మామయ్యకి సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ తెర మీదకు వచ్చింది, నిఖిల్ టీడీపీలో చేరలేదని, కేవలం ఆయనకు సపోర్ట్ గా మాత్రమే అక్కడికి వెళ్లారని ఆయన టీం వెల్లడించింది.
Yarlagadda Venkat Rao: యార్లగడ్డ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేత వీరాంజనేయులు
ఇక 2019లో టీడీపీ తరపున ప్రచారం కూడా చేశారు. కర్నూల్ జిల్లా డోన్‌లో టీడీపీ తరుపున ప్రచారం చేసి టీడీపీకి ఓటు గుద్దండంటూ చంద్రబాబు స్టైల్‌లో రెండు వేళ్లూ చూపిస్తూ ఓ రేంజ్‌లో ఆయన ప్రచారం చేశారు. అయితే ఆ తరువాత నాపై రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు, నేను ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నా అంటూ ప్రచారం చేస్తున్నారు. అవన్నీ చెత్త వార్తలు.. వాటిని నమ్మొద్దు, నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయడం లేదని పేర్కొన్నారు. మంచి వాళ్లు ఎక్కడ ఉన్నా ఒక యాక్టర్‌గా కాకుండా యంగ్ ఇండియన్‌గా నా వంతు కృషి చేస్తా, డోన్ అభ్యర్ధి మా ఫ్యామిలీ మెంబర్ అందుకే సపోర్ట్ చేస్తున్నా అంటూ అప్పట్లో ఒక వీడియో రిలీజ్ చేశారు.ఇక సినిమాల విషయానికి వస్తే చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ‘స్వయంభూ’ సినిమాలో హీరో నిఖిల్ ఓ వారియర్ పాత్రలో కనిపించనున్నారు.
తెలుగుదేశం పార్టీ లో చేరిన హీరో నిఖిల్ సిద్ధార్థ యాదవ్. పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.#TeluguDesamParty #NaraLokesh pic.twitter.com/fQ5Lt5x1Jh
— Telugu Desam Party (@JaiTDP) March 29, 2024