Rishabh Pant: మేం తోపులం, కానీ కలిసిరాలేదు.. రిషభ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- రాజస్థాన్ రాయల్స్ చేతిలో లక్నో పరాజయం
- లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
- మేం తోపులం, కానీ కలిసిరాలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant Reacts After LSG Loss To RR: ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం రాజస్థాన్ రాయల్స్ చేతిలో పరాజయం అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టోర్నీలో తమ పరిస్థితి ఎలా ఉన్నా.. లక్నో గొప్ప జట్టు అని పేర్కొన్నాడు. తమ జట్టులో మ్యాచ్ గెలిపించే సామర్థ్యం అందరిలో ఉందని చెప్పాడు. ఫలితాలు అనుకూలంగా రాకపోతే.. తాము బలహీన జట్టు కాదన్నాడు. ఆటగాళ్లుగా, జట్టుగా తమకెప్పుడూ తమపై నమ్మకం ఉంటుందని ధీమా వ్యక్తం చేశాడు. తాము తోపులం అని, కానీ ఈ సీజన్ అంతగా కలిసి రాలేదని పంత్ చెప్పుకొచ్చాడు.
జైపూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో 220 పరుగుల భారీ స్కోర్ సాధించినప్పటికీ.. బౌలర్లు ఆ లక్ష్యాన్ని కాపాడలేకపోయారు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన రిషభ్ పంత్.. ఈ వికెట్‌పై మరో 5-10 పరుగులు అదనంగా చేసి ఉంటే ఫలితం వేరేగా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా చివరి ఓవర్లలో జోఫ్రా ఆర్చర్ అద్భుతంగా బౌలింగ్ చేసి తమను కట్టడి చేశాడని పేర్కొన్నాడు. ‘ఈ పిచ్‌పై 220 మంచి స్కోరే అయినా మా ఆరంభాన్ని బట్టి చూస్తే ఇంకొన్ని పరుగులు చేయాల్సింది. మధ్య ఓవర్లలో, ముఖ్యంగా చివరి ఓవర్లో జోఫ్రా ఆర్చర్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆ దశలో మేము మరింత దూకుడుగా ఆడి ఉంటే మరో 5 లేదా 10 పరుగులు అదనంగా వచ్చేవి. అదే మ్యాచ్‌లో తేడా తీసుకొచ్చేది’ అని పంత్ చెప్పాడు.
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
ఇంత భారీ స్కోర్‌ను కూడా కాపాడలేకపోవడం గురించి మాట్లాడిన రిషభ్ పంత్.. ‘ఇలాంటి బ్యాటింగ్‌కు అనుకూలమైన వికెట్‌పై బౌలర్లకు ఏమీ చేయడనికి ఉండదు. అయినప్పటికీ కెప్టెన్‌గా నేను ఎప్పుడూ బౌలర్లకు మద్దతుగా ఉంటాను. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ సూచనలు ఇవ్వడం కంటే సింపుల్ ప్లాన్‌తో ఒక్కో బంతిపై దృష్టి పెట్టి అమలు చేయడం ముఖ్యం. ప్రత్యర్థి జట్టులో లెఫ్ట్ హ్యాండర్లు ఉండటంతో వెంటనే ఎడమచేతి స్పిన్నర్‌ను బౌలింగ్‌కు తీసుకురావాలనుకోలేదు. అందుకే షహబాజ్ అహ్మద్‌కు ఆలస్యంగా బంతిని ఇచ్చా. దిగ్వేశ్ రాఠీ ఉండటంతో రిస్క్ తీసుకోవద్దని భావించాం. అందుకే అహ్మద్‌కు చివర్లో బౌలింగ్‌కు తీసుకొచ్చాం’ అని వివరించాడు
జట్టులో మహ్మద్ షమీ వంటి అనుభవజ్ఞుడి లేకపోవడం ఎంత ప్రభావం చూపిందన్న ప్రశ్నకు పంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘అనుభవం అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు. ఏళ్ల తరబడి ఆడితేనే వస్తుంది. ఒత్తిడి పరిస్థితుల్లో అనుభవం చాలా కీలకం. అలాంటి ఆటగాళ్లు జట్టులో ఉంటే తేడా స్పష్టంగా కనిపిస్తుంది. షమీ వంటి బౌలర్ లేకపోవడం ఖచ్చితంగా మిస్ అవుతాము. ప్రస్తుతం మా పరిస్థితి ఎలా ఉన్నా.. మేం గొప్ప జట్టమే. మా జట్టులో మ్యాచ్ గెలిపించే సామర్థ్యం ఉంది. ఫలితాలు మా వైపు రాలేదు’ అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!