PBKS vs RCB: విరాట్ కోహ్లీ ‘సూపర్’ ఇన్నింగ్స్.. పంజాబ్ ముందు భారీ లక్ష్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ (92: 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రజత్ పాటిదార్ (55: 23 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), కామెరాన్ గ్రీన్ (46: 27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇనింగ్స్ ఆడారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, విధ్వత్ కవెరప్ప 2 వికెట్స్ తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకి ఆదిలోనే పంజాబ్ అరంగేట్ర పేసర్ విధ్వత్ కవెరప్ప షాకిచ్చాడు. తన తొలి ఓవర్లోనే కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ (9)ను ఔట్ చేశాడు. తర్వాతి ఓవర్లో హిట్టర్ విల్ జాక్స్ (12)ను వెనక్కి పంపాడు. దాంతో 43 పరుగులకే బెంగళూరు రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన రజత్ పాటిదార్ పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కోహ్లీ అండతో 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. ధాటిగా ఆడుతున్న అతడు బెయర్‌స్టోకు దొరికాడు. ఈ సమయంలో వర్షం కారణంగా మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది.
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
Also Read: SIT Trailer: సస్పెన్స్ థ్రిల్లర్ ‘సిట్’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన విశ్వక్ సేన్!
పదో ఓవర్ తర్వాత కోహ్లీ రెచ్చిపోయాడు. సామ్ కరన్, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చహర్ ఓవర్లో భారీ షాట్లు ఆడాడు. ఈ క్రమంలో 33 బంతుల్లో అర్ధ శతకం బాదాడు. ఆ తర్వాత గేర్ మార్చి.. ఎడాపెడా బౌండరీలు బాదాడు. కామెరూన్ గ్రీన్ సైతం ధాటిగా ఆడడంతో పరుగుల వరద పారింది. సెంచరీకి చేరువైన కోహ్లీ 92 పరుగుల వద్ద ఔటయ్యాడు. దినేశ్ కార్తిక్ (18) బాదేశాడు. అయితే ఆఖరి ఓవర్లో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీసి బెంగళూరు స్కోర్ 250 దాటకుండా చూశాడు.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!