భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ గ్రౌండ్‌లో చిరుతపులిలా పరుగెత్తడం చూస్తూ ఉంటాం. ఫీల్డింగ్ అయినా, వికెట్ల మధ్య అయినా వేగంగా పరుగులు తీస్తాడు. అయితే ఈరోజు చివరి టెస్టులో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ జోరుకు బ్రేక్ పడినట్లుగా అనిపించింది. ఎందుకంటే.. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తే కోహ్లీ.. రనౌట్ అయ్యాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో డైవింగ్ చేసినా వికెట్ కాపాడుకోలేకపోయాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఆడిన ఒక్క మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.. అయితే.. ఇక నుంచి గెలుపు బాటలు వేసేందుకు లక్నో కీలక నిర్ణయం తీసుకుంది. డేవిడ్ విల్లే స్థానంలో న్యూజిలాండ్ సీమర్ మ్యాట్ హెన్రీని తీసుకున్నట్లు ప్రకటించింది. అయితే.. ఐపీఎల్ 2024 వేలంలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ డేవిడ్ విల్లేను లక్నో సూపర్ జెయింట్స్.. రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది.
New Zealand Pacer Matt Henry ruled out of ICC ODI World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో హ్యాట్రిక్ ఓటములతో డేంజర్ జోన్‌లోకి వెళ్లిన న్యూజీలాండ్‌కు భారీ షాక్ తగిలింది. కివీస్ స్టార్ బౌలర్ మ్యాట్ హెన్రీ జట్టుకు దూరం అయ్యాడు. హార్మ్ స్ట్రింగ్ ఇంజ్యురీ కారణంగా ప్రపంచకప్ 2023 నుంచి వైదొలిగాడు. మ్యాట్ గాయం తీవ్రత ఎక్కువగా ఉండడం, ఇప్పట్లో అతడు కోలుకునే అవకాశం లేకపోవడంతో టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు.…