ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.. గుజరాత్‌పై గెలుపుతో క్వాలిఫయర్-2కి ముంబై దూసుకెళ్తే.. ఈ మ్యాచ్‌లో ఓటమి మూఠగట్టుకున్న గుజరాత్ టైటాన్స్ మాత్రం ఇంటిదారి పట్టింది..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) ఈరోజు ముంబై ఇండియన్స్ (MI)తో తలపడుతోంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసింది. 5 వికెట్ల నష్టానికి 2228 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అదరగొట్టాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఐపీఎల్ 2025లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా మరికొన్ని గంటల్లో గుజరాత్ టైటాన్స్ , ముంబై ఇండియన్స్ జట్లు ఎలిమినేటర్‌లో తలపడనున్నాయి. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టు ఇంటిదారి పట్టాల్సిందే. గెలిచిన జట్టు మాత్రం క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్‌తో తలపడాల్సి ఉంటుంది. మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. ముల్లాన్‌పూర్ పిచ్ నిన్న బౌలింగ్, బ్యాటింగ్‌కు కూడా అనుకూలించింది. మరి ఈరోజు పిచ్ ఎలా ఉంటుందో అని ఆసక్తికరంగా మారింది.…
ఐపీఎల్ 2025లో నేడు మరో ఆసక్తికర సమరం జరగనుంది. ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ముల్లాన్‌పుర్‌లో రాత్రి 7.30 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఓడిన టీమ్ లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది. ఎలిమినేటర్ మ్యాచ్ కాబట్టి ఇరు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. గుజరాత్, ముంబై జట్లలో స్టార్స్ ఉన్నారు కాబట్టి మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. లీగ్ ఆరంభం నుంచి గుజరాత్ టైటాన్స్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడుతోంది. రెండు జట్ల మధ్య మ్యాచ్ ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన పంజాబ్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేసింది. పంజాబ్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. 14.1 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి పంజాబ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. మార్కస్ స్టాయినిస్ (26)…
ఈ సారి ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్, శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ జట్ల మధ్య రేపు హై టెన్షన్ మ్యాచ్ కి అంతా సిద్ధమైంది. అయితే ఈ రెండు జట్లకు టైటిల్ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. గత రికార్డుల్ని పరిశీలిస్తే ఎలిమినేటర్ ఆడిన జట్టు ఒక్కసారి మాత్రమే టైటిల్ గెలిచింది. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఘనత సాధించింది.