ఐపీఎల్ 2024లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన లక్నో ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా.. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక విజయాన్ని మాత్రమే అందుకున్న ఢిల్లీ.. లక్నోపై గెలవాలని చూస్తోంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు మ్యాచ్ లు గెలిచి కేవలం ఒక ఓటమిని ఎదుర్కొన్న ఎల్‌ఎస్‌జీ.. మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనుకుంటోంది. ఐపీఎల్‌లో ఢిల్లీపై లక్నోకి మంచి ఆధిపత్యం ఉంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లలో తలపడగా.. మూడు మ్యాచ్‌ల్లో లక్నో గెలిచింది. ఓ మ్యాచ్ రద్దయింది.
Viral Video: పడుకున్న దానిని లేపి తన్నించుకోవడం అంటే ఇదే కాబోలు..!
లక్నో ప్లేయింగ్ ఎలెవన్:
క్వింటాన్ డికాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్ కీపర్), పడిక్కల్, స్టోయినీస్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్.
ఢిల్లీ ప్లేయింగ్ ఎలెవన్:
పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, హోప్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), స్టబ్స్, అక్షర్ పటేల్, మెక్ గర్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.