Buttler makes Virat kohli’s Century Worthless in IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో రాజస్తాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ చెలరేగుతున్నాడు. ఐపీఎల్ 2024లో రెండో సెంచరీ చేశాడు. మంగళవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ అజేయ సెంచరీ బాదాడు. 17వ సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌ల్లో 250 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ స్టాండింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. బట్లర్ తన అద్భుత బ్యాటింగ్‌తో ఇతర బ్యాటర్ల సెంచరీలకు విలువ లేకుండా చేస్తున్నాడు.
గత వారంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఆడింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్‌లో బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత శతకం చేశాడు. 72 బంతుల్లో 113 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీ శతకంతో రాజస్థాన్‌కు బెంగళూరు 184 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్.. కోహ్లీ శతకానికి విలువ లేకుండా చేశాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి సెంచరీ చేయడమే కాకూండా.. జట్టును గెలిపించాడు. దాంతో కోహ్లీ సెంచరీ వృధా అయింది.
Also Read: Jos Buttler Century: జోస్ బట్లర్ సూపర్ సెంచరీ.. క్రిస్ గేల్ రికార్డు బద్దలు!
మంగళవారం (ఏప్రిల్ 16) కోల్‌కతా నైట్ రైడర్స్‌తో రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో సునీల్ నరైన్ మెరుపు శతకం చేశాడు. 56 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సులతో 109 రన్స్ చేశాడు. ఈసారి ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన బట్లర్.. అజేయ సెంచరీతో జట్టును గెలిపించాడు. 20వ ఓవర్ మొదటి బంతికి శతకం చేసిన బట్లర్. చివరి బంతికి జట్టును గెలిపించాడు. దాంతో నరైన్ వందకు విలువ లేకుండా చేశాడు. అద్భుతంగా ఆడిన బట్లర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.