Rohit Sharma: రోహిత్ శర్మ ఔటా? నాటౌటా? ఇదిగో సాక్ష్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL Released The Video Proof Of Rohit Sharma Dismissal That Had World Talking: ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో.. రోహిత్ శర్మ వికెట్‌పై ఎంత వివాదం చెలరేగిందో అందరికీ తెలుసు. రోహిత్ శర్మది న్యాయబద్దమైన ఔట్ కాదని, కీపర్ సంజూ శాంసన్ గ్లోవ్స్ తాకడం వల్ల బెయిల్స్ కిందకు పడిపోయాయని, ఇది చాలా అన్యాయమంటూ సోషల్ మీడియాలో డిబేట్లు నడుస్తున్నాయి. అది ఔటేనని ఒక వర్గం వారు చెప్తుంటే.. కాదంటూ మరో వర్గం వారు వాదిస్తున్నారు. కనీసం రివ్యూ కూడా తీసుకోకుండా.. అలా ఎలా ఔట్‌గా నిర్ధారిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైడ్స్, నో బాల్స్‌కి కూడా రివ్యూ చూస్తున్న ఈ రోజుల్లో.. రోహిత్ శర్మ ఔట్ అవ్వడానికి ఎందుకు మరోసారి పరిశీలించలేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. చివరికి ముంబై ఇండియన్స్ క్యాంప్‌కి చెందిన వాళ్లు సైతం.. రోహిత్ వికెట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. సైడ్ యాంగిల్స్‌లో పరిశీలించి ఉంటే.. అది ఔటో, కాదో క్లారిటీగా తెలిసి ఉండేదని అభిప్రాయాలు వ్యక్తపరిచారు. కానీ.. ఏమాత్రం చెక్ చేయకుండా దీన్ని ఔట్‌గా ఖరారు చేయడం, నిజంగా అన్యాయమేనన్నారు.
RCB vs LSG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న ఆర్సీబీ
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం

ఇలా నిన్నటి నుంచి రోహిత్ శర్మ వికెట్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా.. ముంబై ఇండియన్స్ అభిమానులు ఐపీఎల్ నిర్వాహకుల్ని నిందిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే.. ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు ఐపీఎల్ నిర్వాహకులు.. రోహిత్ శర్మ వికెట్‌కి సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇందులో సైడ్ యాంగిల్ నుంచి చూపించారు. ఇందులో రోహిత్ శర్మ ఔట్ అవ్వడానికి చాలా స్పష్టంగా చూడొచ్చు. నేరుగా బంతి తగలడం వల్లే.. బెయిల్స్ ఎగిరి రోహిత్ బౌల్డ్ అయ్యాడు. ఇందులో సంజూ గ్లౌవ్స్ వికెట్లని తాకడం కాదు కదా.. అతడు ఒక అడుగు దూరంలో ఉండటాన్ని మనం క్లియర్‌గా గమనించవచ్చు. కాబట్టి.. రోహిత్ శర్మది అన్యాయమైన ఔట్ అని వచ్చిన కామెంట్లకు ఈ వీడియోతో చెక్ పడినట్టేనని చెప్పుకోవచ్చు. విడ్డూరం ఏమిటంటే.. ఈ వీడియో చూసి కూడా, కొందరు ఇంకా విమర్శలు చేస్తూనే ఉన్నారు. సంజూ తన కాలితో వికెట్లని తాకి, బెయిల్స్ పడిపోయేలా చేశాడంటూ వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు. ఎవరేమన్నా సరే.. ఇది మాత్రం ఫెయిర్ వికెట్ అని ఈ వీడియోతో తేలిపోయింది. కాబట్టి, నో డిబేట్స్!
Mark Cuban: ఎలాన్ మస్క్‌కి ఫిట్టింగ్.. రోజుకి 1000 ఫాలోవర్లు పోతున్నారంటూ ఫిర్యాదు
The dismissal that had the world talking!
IPL’s 1️⃣0️⃣0️⃣0️⃣th match had no shortage of drama 👌🏻👌🏻#IPL1000 | #TATAIPL | #MIvRR | @mipaltan | @rajasthanroyals | @ImRo45 | @IamSanjuSamson pic.twitter.com/qGOUNSiV6H
— IndianPremierLeague (@IPL) May 1, 2023
తాజావార్తలు
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!