US Investor Mark Cuban Claims He Losing 1000 Followers A Day: బిలియనీర్ వ్యవస్థాపకుడు, ఇన్వెస్టర్ మార్క్ క్యూబన్ తాజాగా ట్విటర్‌పై ఓ అనూహ్య ఫిర్యాదు చేశాడు. తాను బ్లూ సబ్‌స్క్రిప్షన్ కోసం డబ్బులు కట్టినప్పటికీ.. రోజుకి 1000 మంది ఫాలోవర్లు పోతున్నారంటూ వాపోయాడు. అంతేకాదు.. గతంతో పోలిస్తే, ఇప్పుడు తన ట్వీట్ల రీచ్ గణనీయంగా తగ్గిందని కూడా పేర్కొన్నాడు. ‘‘కొత్త యూజర్లతో పాటు పాత ట్విటర్ యూజర్లకు ‘పాసిబుల్ ఫాలోయింగ్’ ఆప్షన్‌లో నా ట్విటర్ ఖాతా చూపించడం లేదని నేను కనుగొన్నాను. బహుశా వార్షిక కాంట్రాక్ట్‌లో భాగంగా డబ్బులు కడితే, ఆ సమస్య పరిష్కారం అవుతుందని భావించాను. కానీ.. డబ్బులు కట్టిన తర్వాత కూడా అది మారలేదు. దానికితోడు నా ట్వీట్ల రీచ్ కూడా బాగా తగ్గిపోయింది’’ అంటూ అతడు చెప్పుకొచ్చాడు.
Extramarital Affair: వివాహేతర సంబంధం.. పక్కా స్కెచ్ వేసి భార్య రివేంజ్
నిజానికి.. క్యూబన్ ఎప్పుడూ తన ఫాలోవర్ల సంఖ్య గురించి పట్టించుకోలేదు. అయితే.. ఈమధ్య కాలంలో ఆయన ఆన్‌లైన్ ఫార్మసీ ప్రారంభించాడు. దాని గురించి ఆయన నెట్టింట్లో విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో తన ఫాలోవర్ల సంఖ్య తగ్గిపోతుండటంతో.. ఈ అభ్యంతరాన్ని లేవనెత్తాడు. గత నెలలోనూ ఆయన.. పోతున్న ఫాలోవర్లను వెనక్కు రప్పించుకోవడం, అలాగే ఫాలోవర్ల సంఖ్యను పెంచుకోవడం కోసం ఏం చేయాలో సూచించాల్సిందిగా ఎలాన్ మస్క్‌ని ట్విటర్ వేదికగా అడిగాడు. ‘‘నా ఫాలోవర్ల సంఖ్య తగ్గిపోతుండటంతో.. దానికి చెక్ పెట్టేందుకు నేను ‘బ్లూ’ టిక్‌కి మారాను. బ్లూ టిక్ సబ్‌స్ర్కిప్షన్ తీసుకుంటే.. పోయిన ఫాలోవర్లు తిరిగి రావడంతో పాటు కొత్త ఫాలోవర్లు వస్తారనే ఉద్దేశంతో అలా చేశాను. కానీ.. నాకు ఎలాంటి ఛేంజెస్ కనిపించడం లేదు. దీనిపై మీ సూచనలు ఏమైనా ఉన్నాయా?’’ అని ట్వీట్ చేశాడు. కానీ.. ఎలాన్ మస్క్ అందుకు బదులివ్వలేదు.
Wasim Akram: ధోనీకి అతడే సరైన వారసుడు.. సీఎస్కే కెప్టెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు
సరిగ్గా ఇలాంటి సమస్యనే ఎలాన్ మస్క్ గత డిసెంబర్‌లో ఎదుర్కున్నాడు. తన పోస్టులకు లైక్స్‌తో పాటు రీట్వీట్ల సంఖ్య గణనీయంగా పడిపోయిందని అతడు ఫిర్యాదు కూడా చేశాడు. అందుకు ఓ ఇంజనీర్.. బహుశా నెటిజన్లు తన ట్వీట్ల పట్ల ఆసక్తి కోల్పోయి ఉంటారని, అందుకే కౌంట్ పడిపోతుందని బదులిచ్చినట్టు తెలిసింది. అందుకు ప్రతీకారంగా.. మస్క్ ఆ ఇంజనీర్‌ని సంస్థ నుంచి తొలగించాడని సమాచారం. మరోవైపు.. ప్రస్తుత ట్విటర్ మార్పుల పట్ల కూడా క్యూబన్ మండిపడ్డాడు. కొత్త విధానాలన్నీ చాలా చెత్తగా ఉన్నాయంటూ తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. అయితే.. దీనిపై మస్క్ ఇంతవరకూ స్పందించకపోవడం గమనార్హం. కాగా.. 2008లో ట్విటర్‌లో తన ఖాతా తెరిచిన క్యూబన్, ఇప్పటివరకూ 8.8 మిలియన్ ఫాలోవర్లను కలిగి ఉన్నాడు.