Virat Kohli: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB Star Virat Kohli Breaks Shikhar Dhawan Record: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్లో అరుదైన రికార్డులు నెలకొల్పాడు. ఐపీఎల్ ఛేదనలో అత్యధిక సార్లు హాఫ్ సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ (70 నాటౌట్; 44 బంతుల్లో 6×4, 3×6) అర్ధ శతకం చేయడంతో.. ఈ అరుదైన రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛేదనలో విరాట్ 24 హాఫ్ సెంచరీలు బాదాడు.
అంతకుముందు ఐపీఎల్ ఛేదనలో అత్యధిక సార్లు హాఫ్ సెంచరీలు చేసిన భారత ఆటగాడి రికార్డు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ పేరిట ఉంది. ఐపీఎల్ ఛేజింగ్‌లో గబ్బర్ 23 సార్లు 50కి పైగా స్కోరు చేశాడు. గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌తో ధావన్ రికార్డును విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా ఐపీఎల్ ఛేదనలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రికార్డు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పేరుపై ఉంది. వార్నర్ 35 సార్లు ఐపీఎల్ ఛేదనలో అర్ధ శతకాలు బాదాడు. ఈ జాబితాలో కేఎల్ రాహుల్ (22), గౌతమ్ గంభీర్ (20) టాప్ 5లో ఉన్నారు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: CSK vs SRH: చరిత్ర సృష్టించిన చెన్నై సూపర్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టు!
విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు కూడా చేరింది. ఐపీఎల్లో అత్యధిక సీజన్లలో 500లకు పైగా పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. 7 సీజన్లలో విరాట్ 500లకు పైగా పరుగులు చేశాడు. డేవిడ్ వార్నర్ కూడా 7 సీజన్లలో 500లకు పైగా రన్స్ బాదాడు. ఈ జాబితాలో శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. ధావన్, రాహుల్ 5 సార్లు 500 మార్క్‌ను అందుకున్నారు. ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. 500 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ విరాట్ వద్దే ఉంది.
తాజావార్తలు
-
Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్‌తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
-
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
-
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
ట్రెండింగ్
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!