Chennai Super Kings Scored 85 Runs In First 10 Overs Against GT: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఈరోజు (23-05-23) గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో జీటీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో.. చెన్నై బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 85 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అర్థశతకంతో వీరవిహారం చేయడం వల్లే.. చెన్నై స్కోరు ఇలా దూసుకెళ్తోంది. తొలుత క్రీజులో కుదురుకోవడం కోసం కొంత సమయం తీసుకున్న రుతురాజ్.. ఆ తర్వాతి నుంచి రెచ్చిపోయాడు. జీటీ బౌలర్ల స్వభావాన్ని అర్థం చేసుకున్న తర్వాత, వారిపై విరుచుకుపడటం మొదలుపెట్టాడు. బౌండరీల మోత మోగించేసి, మైదానంలో పరుగుల వర్షం కురిపించాడు.

Skyscrapers: ప్రపంచంలో అత్యధిక స్కైస్క్రాపర్స్ కలిగిన టాప్-10 నగరాలు
రుతురాజ్‌తో పాటు బరిలోకి దిగిన డెవాన్ కాన్వే మాత్రం ఇంకా తన ఖాతా తెరువలేదు. రుతురాజ్ ఊపందుకోవడంతో.. అతనికి స్టాండ్ ఇస్తున్నాడు. సింగిల్స్ తీస్తూ.. రుతురాజ్‌ని మద్దతుగా నిలిచాడు. నిజానికి.. ఇతడు ఆరో ఓవర్‌లోనే క్యాచ్ ఔట్ అవ్వాల్సింది. మూడో స్లిప్‌లో నిల్చున్న ఫీల్డర్ చేతికి క్యాచ్ చిక్కినట్టే చిక్కి, అది బౌండరీ వైపుకు పరుగులు పెట్టింది. అలా అతనికి లైఫ్ రావడంతో, దాన్ని తనదైన శైలిలో సద్వినియోగపరచుకుంటున్నాడు. అనవసరమైన షాట్ల జోలికి వెళ్లకుండా, క్రీజులో తన స్థానాన్ని పదిలపరచుకున్నాడు. మరోవైపు రుతురాజ్ మాత్రం.. జీటీ బౌలర్లపై తాండవం చేస్తున్నాడు. ఇంకా పది ఓవర్లు ఉండటం, చెన్నైలో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడే ఆటగాళ్లు ఉన్నారు కాబట్టి.. మరో 10 ఓవర్లలో ఊచకోత కోసి.. గుజరాత్ టైటాన్స్‌కి చెన్నై జట్టు భారీ లక్ష్యమే నిర్దేశించేలా కనిపిస్తోంది.
Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఆ హామీలన్ని అమలు చేస్తాం