Biker Release Date: శర్వా స్పీడ్ మామూలుగా లేదుగా! ‘బైకర్’ రిలీజ్ డేట్ లాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Biker Release Date: ఇండియన్ సినిమాలో మొదటిసారిగా మోటార్‌క్రాస్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన హై-ఆక్షన్ స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’. అభిలాష్ రెడ్డి కంకారా దర్శకత్వంలో చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా, మలవిక నాయర్ ఫీమేల్ లీడ్‌గా నటిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 3, 2026న భారీస్థాయిలో థియేటర్లలోకి రాబోతోంది. UV క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈ మూవీని నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి టీజర్ రిలీజ్ అయ్యి సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తిని పెంచింది. ఇక రేపు ఈ చిత్రంలో ‘బుల్లెట్ సునీల్’ అనే పాత్రను పరిచయం చేయబోతున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ వెల్లడించింది. ఫిబ్రవరి 4న ఉదయం 11.07 గంటలకు ఈ మూవీ నుంచి బుల్లెట్ సునీల్ గ్లింప్స్‌ను రివీల్ చేయబోతున్నట్లు అఫిషియల్‌గా ప్రకటించారు.
READ ALSO: Solid Fuel Ducted Ramjet: SFDR టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించిన DRDO..(వీడియో)
Also Read
బైక్ రేసింగ్‌పై విపరీతమైన ఇష్టం ఉన్న ఒక యువకుడి జీవితం గురించి, ఆ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న పోటీలు, సవాళ్లు, ప్రమాదాల మధ్య ఎలా ముందుకు దూసుకెళ్తాడో అనే కథాంశం చుట్టూ రూపుదిద్దుకున్న చిత్రంగా బైకర్ రెడీ అవుతున్నట్లు సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం అవుతుంది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అతుల్ కుల్కర్ణి వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డిసెంబర్ 6, 2025న విడుదల కావాల్సిన ఈ సినిమా.. ఆ టైంలో వాయిదా పడింది. ఇప్పుడు 3D, 4DX ఫార్మాట్లలో సమ్మర్ సీజన్‌లో భారీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. శర్వానంద్ ఫ్యాన్స్‌తో పాటు సినిమా ప్రేమికులకు ఇది గ్రాండ్ ట్రీట్ అవుతుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.
READ ALSO: Dhurandhar 2: అడివి శేష్ వర్సెస్ రణ్‌వీర్ సింగ్.. డెకాయిట్ రిలీజ్ డేట్ మారబోతుందా?
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!