ఎప్పటిలాగానే ఈ సీజన్లో కూడా తగినంత ప్రతిభ చూపించడం లేదు. ఆడిన మూడు మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్లో గెలిచి.. రెండింటిలో ఓడిపోయింది. ఇక.. జట్టు పరంగా చూస్తే అందరూ మంచి ఆటగాళ్లే కనపడుతున్నారు. కోహ్లీ, మ్యాక్స్ వెల్, గ్రీన్, డుప్లెసిస్ లాంటి ప్లేయర్లు ఉన్నప్పటికీ.. తగినంత స్థాయిలో రాణించలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ సీజన్లో ఆడిన మ్యాచ్ల్లో ఓపెనర్గా బరిలోకి దిగిన డుప్లెసిస్.. బ్యాటింగ్ లో విఫలమయ్యాడు. ఇకపోతే.. బౌలర్లు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆడిన మూడు మ్యాచ్ల్లో స్టార్ బ్యాటర్ కోహ్లీ ఒక్కడే కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. ఈ క్రమంలో.. ఆ జట్టుపై మాజీ క్రికెటర్లు విమర్శల జల్లు కురిపిస్తున్నారు. కాగా.. బెంగళూరు మేనేజ్‌మెంట్‌కు క్రిష్ణమాచారి శ్రీకాంత్ కీలక సూచనలు చేశాడు.
Chandrababu: మార్కాపురం ప్రజాగళం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
‘‘విల్ జాక్స్ బ్యాటర్‌గా హిట్టింగ్ చేస్తాడు. అంతేకాకుండా.. ఆఫ్ స్పిన్ బౌలింగ్ వేయగలడు. నేను బెంగళూరు కెప్టెన్ అయితే జాక్స్‌ను విరాట్‌తో కలిసి ఓపెనర్‌గా పంపిస్తా’’. అని శ్రీకాంత్ తెలిపారు. డుప్లెసిస్ ను మూడో స్థానంలో ఆడిస్తానని.. కామెరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆ తర్వాత వస్తారు. జాక్స్‌తో రెండు ఓవర్లు బౌలింగ్ వేయిస్తానన్నాడు. గత మూడు మ్యాచుల్లోనూ విఫలమైన అల్జారీ జోసెఫ్‌తోపాటు రజత్ పటీదార్‌ను పక్కన పెట్టి.. యువ బౌలర్ ఆకాశ్ దీప్‌కు అవకాశం కల్పించాలన్నాడు. అప్పుడు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకం వస్తుందని చెప్పుకొచ్చాడు. లేకపోతే సరైన బౌలింగ్ లేకుండా ఇబ్బంది పడుతూనే ఉండాల్సి ఉంటుంది. కోల్‌కతాతో మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్లు ఒక్క బౌన్సర్ కూడా వేయకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది’’ అని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు.
Sunita Kejriwal: కేజ్రీవాల్ సింహం.. ఎక్కువ కాలం జైలులో ఉంచలేరు..
మరోవైపు కోల్ కతాతో జరిగిన మ్యాచ్ కోహ్లీ బ్యాటింగ్ పై ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ-కోల్ కతా మ్యాచ్ లో సునీల్ నరైన అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. భారీ సిక్స్‌లు కొట్టాడు. మ్యాచ్‌ను అతడు తమ వైపు లాగేసుకున్నాడని తెలిపారు. ఫిల్ సాల్ట్ కూడా దూకుడుగా ఆడాడు. మొదటి ఓవర్‌లోనే 18 పరుగులు రాబట్టారు.. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు పవర్‌ప్లేలోనే 85 పరుగులు సాధించారని పేర్కొన్నారు. బెంగళూరు బౌలర్లలో ఎవరినీ వదిలిపెట్టలేదు.. కానీ కోహ్లీ మాత్రం 59 బంతుల్లో 83 పరుగులు చేశాడు. ఇక తొలి ఆరు ఓవర్లలో బెంగళూరు బౌలర్లు బౌన్సర్లు, యార్కర్లకు అస్సలు ప్రయత్నించలేదు’’ అని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విశ్లేషించాడు.