Ajit Agarkar Explains Why KL Rahul Missed Out for T20 World Cup 2024: జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. మెగా టోర్నీలో పాల్గొనే జట్లను ఆయా క్రికెట్ బోర్డులు ఇప్పటికే ప్రకటించాయి. 15 మందితో కూడిన భారత జట్టును మంగళవారం (ఏప్రిల్ 30) బీసీసీఐ ప్రకటించింది. వికెట్ కీపర్ స్థానంలో రిషబ్ పంత్, సంజూ శాంసన్‌లను సెలెక్టర్లు ఎంపిక చేశారు. దాంతో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు చోటు లేకుండా పోయింది. రాహుల్‌కు ఎందుకు చోటివ్వలేదని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. అయితే ప్రపంచకప్ జట్టు ఎంపికకు సంబంధించి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ గురువారం మీడియాతో మాట్లాడారు.
కేఎల్ రాహుల్‌ను ఎందుకు టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపిక చేయలేదు అని ఓ రిపోర్టర్ అడగ్గా.. మిడిలార్డర్‌లో బాగా ఆడే వికెట్ కీపర్‌ను తీసుకోవాలనుకున్నాం అని, రాహుల్ కంటే సంజూ శాంసన్ తమకు బెస్ట్ ఆప్షన్ అనిపించిందని అజిత్ అగార్కర్ తెలిపాడు. ‘ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా ఆడుతున్నాడు. మాకు మిడిలార్డర్‌లో ఆడే వికెట్ కీపర్ కావాలి. అందుకే సంజూ శాంసన్, రిషబ్ పంత్‌లను ఎంచుకున్నాం. బ్యాటింగ్ లైనప్‌లో సంజూ ఏ స్థానంలోనైనా ఆడగలడు. బ్యాటర్ ఎవరా? అనేది మేము చూడలేదు. మాకు కావాల్సిన ఆప్షన్స్‌ను మాత్రమే ఎంచుకున్నాం’ అని అగార్కర్ స్పష్టం చేశాడు.
Also Read: Anasuya Bharadwaj: ఉప్పల్ మైదానంలో అనసూయ సందడి.. వైరల్‌గా మారిన హాట్ యాంకర్ రియాక్షన్!
రింకు సింగ్‌ను ఎంపిక చేయకపోవడమనేది తాము తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయమని అజిత్ అగార్కర్ అన్నాడు. ‘రింకు సింగ్‌ను తీసుకోకపోవడం మేం తీసుకున్న కఠిన నిర్ణయం. అతడి తప్పేమీ లేదు. శుభ్‌మన్ గిల్ కూడా అంతే. కూర్పు కారణంగా రింకు జట్టుకు ఎంపిక కాలేదు. రింకుకు అవకాశం దక్కకపోవడం దురదృష్టకరం. అతడు ఇప్పుడు రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో ఉన్నాడు. 15 మందిలో ఉండడానికి అతడు ఎంత చేరువగా ఉన్నాడో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు’ అని అగార్కర్ చెప్పుకోచ్చాడు.