Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl 2026 Abhishek Sharma Breaks Chris Gayle Record Most 130 Scores In T20 Cricket Ipl 2026

Abhishek Sharma History: అప్పుడే దిగ్గజం క్రిస్ గేల్ రికార్డు బ్రేక్.. టీ20 క్రికెట్‌లో ‘ఒకే ఒక్కడు’ అభిషేక్ శర్మ!

Published Date :April 22, 2026 , 8:02 am
By Sampath Kumar
  • సన్‌రైజర్స్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ మెరుపు ఇన్నింగ్స్
  • వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డు బ్రేక్
  • టీ20 క్రికెట్‌లో 'ఒకే ఒక్కడు' అభిషేక్
Abhishek Sharma History: అప్పుడే దిగ్గజం క్రిస్ గేల్ రికార్డు బ్రేక్.. టీ20 క్రికెట్‌లో ‘ఒకే ఒక్కడు’ అభిషేక్ శర్మ!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Abhishek Sharma Breaks Chris Gayle Record: టీ20 క్రికెట్ అంటేనే బంతిని బాదడం. బ్యాటర్లు తమ దూకుడు, భారీ షాట్లతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. పొట్టి ఫార్మాట్‌లో 50, 100 పరుగులు చేయడమే గొప్ప విషయం. అలాంటిది 130కు పైగా స్కోర్లు నమోదు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో దూకుడు, ప్రతిభ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఈ జాబితాలో కొద్ది మంది స్టార్ బ్యాటర్లు మాత్రమే చోటు దక్కించుకున్నారు. అందులో యువ ఆటగాడు అభిషేక్ శర్మ ఉండడం, అందులోనూ టాప్‌లో ఉండడం విశేషం.

టీ20 ఫార్మాట్‌లో అత్యధికసార్లు 130+ స్కోర్లు నమోదు చేసిన బ్యాటర్‌గా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ నిలిచాడు. ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం ఉప్పల్‌ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్‌ (135 నాటౌట్‌; 68 బంతుల్లో 10×4, 10×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు టీ20ల్లో నాలుగు సార్లు 130కి పైగా పరుగులు చేశాడు. అభి దూకుడైన బ్యాటింగ్, పవర్ హిట్టింగ్, టైమింగ్.. ఇలా అన్ని కలిసి అతడిని ప్రత్యేక ఆటగాడిగా నిలబెట్టాయి. ఐపీఎల్‌ 2026లో అతడి ఫామ్ చూస్తే ఈ సంఖ్య పెరగడం ఖాయం అనిపిస్తోంది.

టీ20 ఫార్మాట్‌లో అత్యధికసార్లు 130+ స్కోర్లు నమోదు చేసిన బ్యాటర్‌గా ఇప్పటివరకు యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ మూడు సార్లు 130+ స్కోర్లు నమోదు చేశాడు. తాజాగా ఇన్నింగ్స్‌తో గేల్ రికార్డును అభిషేక్‌ శర్మ బ్రేక్ చేశాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా మూడు సార్లు 130+ స్కోర్ చేశాడు. ఫించ్ తన ఆగ్రెసివ్ స్ట్రోక్ ప్లేకు ప్రసిద్ధి కాగా.. గేల్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో టీ20లకు కొత్త నిర్వచనం ఇచ్చాడు. ఇప్పుడు అభిషేక్‌ డేంజరస్ హిట్టర్‌గా బౌలర్లను బెంబేలెత్తిస్తున్నాడు. ఐపీఎల్ కారణంగా భవిష్యత్తులో ఈ జాబితాలో మరిన్ని పేర్లు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Abhishek Sharma
  • Abhishek Sharma 135
  • Abhishek Sharma Century
  • Abhishek Sharma History
  • Abhishek Sharma Record

తాజావార్తలు

  • Abhishek Sharma History: అప్పుడే దిగ్గజం క్రిస్ గేల్ రికార్డు బ్రేక్.. టీ20 క్రికెట్‌లో ‘ఒకే ఒక్కడు’ అభిషేక్ శర్మ!

  • JD Chakravarthy: అందుకే హీరోలు తమ కూతుళ్లను సినిమాల్లోకి రానివ్వరు – జె.డి. చక్రవర్తి

  • Abhishek Sharma సెంచరీ దెబ్బ.. రికార్డులు అబ్బా.. బద్దలైన రికార్డులు ఇవే..!

  • Today Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభం!

  • Ranbir Kapoor: రణ్‌బీర్ కపూర్ డైలమా.. సందీప్ రెడ్డికి ‘హ్యాండ్’ ఇస్తాడా?

ట్రెండింగ్‌

  • 90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!

  • Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!

  • Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!

  • రూ.11 వేలలోపే పవర్‌ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!

  • AMOLED డిస్‌ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions