మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కి తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. మెగా అభిమానులు సాయి ధరమ్ తేజ్ సినిమాలకి సాలిడ్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఈసారి మాత్రం తెలుగు రాష్ట్రాలని దాటి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో థ్రిల్లర్ జోనర్ లో సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ సినిమా చేస్తున్నాడు. SVCC ప్రొడక్షన్ లో, సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 21న రిలీజ్ కావడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ చేసిన మేకర్స్ విరూపాక్ష సినిమాపై పాజిటివ్ బజ్ ని జనరేట్ చెయ్యడంలో సక్సస్ అయ్యారు. లేటెస్ట్ గా విరూపాక్ష ప్రమోషన్స్ లో మరింత జోష్ తెస్తూ విరూపాక్ష ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చెయ్యడానికి రెడీ అయ్యారు. ఏలూరు, సీఆర్ రెడ్డి కాలేజ్ లో, ఏప్రిల్ 16న సాయంత్రం అయిదు గంటల నుంచి విరూపాక్ష ప్రీరిలీజ్ జరగనుంది.
ఈవెంట్ డేట్, ప్లేస్ అండ్ టైమ్ లాక్ అయ్యాయి కానీ ఈ ఈవెంట్ కి వచ్చే చీఫ్ గెస్ట్ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్టీఆర్ ని గ్లిమ్ప్స్ కోసం, పవన్ కళ్యాణ్ ని టీజర్ లాంచ్ కోసం వాడేసారు కాబట్టి ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా రామ్ చరణ్ ని పిలిచే ఛాన్స్ ఉంది. ఇతర మెగా హీరోలు కూడా ఈ ఈవెంట్ లో కనిపించే అవకాశం ఉంది. ప్రీరిలీజ్ ఈవెంట్ కన్నా ముందే విరూపాక్ష ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 11న ఉదయం 11:07 నిమిషాలకి విరూపాక్ష ట్రైలర్ రిలీజ్ కానుంది. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ విరూపాక్ష సినిమాకి మెయిన్ హైలెట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విరూపాక్ష సినిమాని రిలీజ్ చెయ్యనున్న సాయి ధరమ్ తేజ్ భారి హిట్ అందుకుంటాడేమో చూడాలి.
Bring all your Excitement & Energy to celebrate the Grand Pre-release of #Virupaksha 💥
Venue locked ✅
Stay tuned for more details.@IamSaiDharamTej @iamsamyuktha_ @karthikdandu86 @AJANEESHB @Shamdatdop @NavinNooli @bkrsatish @SVCCofficial @SukumarWritings#VirupakshaOnApril21 pic.twitter.com/0OAPDTOGru— SVCC (@SVCCofficial) April 9, 2023
Get ready to be spellbound as you walk into the World of Thrill & Mystery 👁@IamSaiDharamTej's #VirupakshaTrailer tomorrow at 11:07AM 💥@iamsamyuktha_ @karthikdandu86 @AJANEESHB @Shamdatdop @NavinNooli @bkrsatish @SVCCofficial @SukumarWritings#Virupaksha #VirupakshaOnApril21 pic.twitter.com/xL9QWh86Rd
— SVCC (@SVCCofficial) April 10, 2023