ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో జరిగిన మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి విజయం దక్కింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై చేయి సాధించింది. చివరి ఓవర్లో 24 పరుగులు అవసరం కాగా 3 పరుగులే చేయగలిగింది. దీంతో చెన్నై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలోనే బ్రావో వేసిన చివరి ఓవర్ రెండో బంతికి మిల్నే (15) క్యాచ్ ఔట్ అయ్యాడు. 19.4 బంతికి రాహుల్ చాహర్ ఔటయ్యాడు. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ టాప్‌కి చేరుకోగా, ముంబై ఇండియన్స్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. రేపు కేకేఆర్, ఆర్‌సీబీ మధ్య మ్యాచ్ జరగనుంది.