Vaibhav Sooryavanshi: మైదానంలోనే కాదు మార్కెట్లోనూ వైభవ్ జోరు.. 15 ఏళ్లకే కోట్లలో సంపాదన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi Brand Endorsements List: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు మైదానంలోనే కాదు.. వాణిజ్య రంగంలోనూ మార్మోగుతోంది. 15 ఏళ్ల వయసులోనే టీమిండియాలో అరంగేట్రం చేసి.. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఇటీవలి ఇంగ్లండ్ సిరీస్‌లో కాస్త నిరాశపర్చినా.. జింబాబ్వేపై రెచ్చిపోయాడు. రెండు అర్ధ శతకాలతో తన సత్తా చూపించాడు. దాంతో వైభవ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బుడ్డోడి ఆటతీరుతో పాటు పెరుగుతున్న క్రేజ్ కారణంగా ప్రముఖ బ్రాండ్లు కూడా అతడితో ఒప్పందాలు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలో వైభవ్ 15 ఏళ్లకే కోట్లలో సంపాదిస్తున్నాడు.
రూ.7-10 కోట్ల వరకు నెట్ వర్త్:
వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం సుమారు రూ.7 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు నెట్ వర్త్ కలిగి ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఐపీఎల్ ఆదాయం, మ్యాచ్ ఫీజులు, దేశవాళీ క్రికెట్ ద్వారా వచ్చే ఆదాయంతో పాటు బ్రాండ్ ఎండార్స్మెంట్లు అతడి సంపాదనలో కీలకంగా మారాయి. 2026 ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అతడి అద్భుత ప్రదర్శన తర్వాత బ్రాండ్ విలువ ఒక్కసారిగా పెరిగినట్లు సమాచారం. ఒక్కో ఎండార్స్మెంట్ ఒప్పందానికి కోటికి పైగా ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వైభవ్ ఇంకా టీనేజర్ కావడంతో పెద్ద సంఖ్యలో వాణిజ్య ఒప్పందాలు తీసుకోవడంలో అతడి కుటుంబం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. క్రికెట్‌పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేలా కమర్షియల్ కార్యకలాపాలను పరిమితం చేశారట. పలు ప్రముఖ బ్రాండ్లు వైభవ్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆ లిస్ట్ ఏంటో ఓసారి చూద్దాం.
Also Read
- Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
- Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
ఎస్ఎస్ బ్యాట్స్:
ప్రముఖ క్రికెట్ పరికరాల సంస్థ సరీన్ స్పోర్ట్స్ (ఎస్ఎస్)తో వైభవ్ సూర్యవంశీ ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఎక్విప్మెంట్ డీల్ విలువ ఏడాదికి సుమారు రూ.50 లక్షలుగా ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా వైభవ్ పేరుతో ప్రత్యేకంగా ‘Vaibhav Sooryavanshi Edition’ బ్యాట్లను కూడా ఎస్ఎస్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. గతంలో సచిన్ టెండూల్కర్ ఎంఆర్ఎఫ్ బ్యాట్‌కు ఉన్నంత స్థాయిలో భారీ కార్పొరేట్ ఒప్పందం వైభవ్‌కు ఇంకా రాకపోయినా.. అతడి వయసును పరిగణనలోకి తీసుకుంటే ఈ ఒప్పందం చాలా పెద్దదనే చెప్పొచ్చు.
కాంప్లాన్:
2026లో వైభవ్ సూర్యవంశీ కాంప్లాన్కు సంబంధించిన ‘Thoda Plan, Thoda Complan’ ప్రచారంలో కనిపించాడు. చిన్న వయసులోనే ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఎదుగుతున్న వైభవ్ జీవనశైలికి ఈ యాడ్ సరిగ్గా నప్పింది. పోషకాహారం, క్రమశిక్షణ, కష్టపడి సాధించాలనే లక్ష్యం వంటి అంశాలను ఈ క్యాంపెయిన్ ద్వారా చూపించారు. యువతలో వైభవ్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని బ్రాండ్ అతడిని ప్రచారానికి ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
గూగుల్ పే:
డిజిటల్ చెల్లింపుల సంస్థ గూగుల్ పే ప్రచారంలోనూ వైభవ్ నటించాడు. ఇందులో టీనేజర్లు డిజిటల్ చెల్లింపులను ఎలా సురక్షితంగా ఉపయోగించుకోవచ్చనే అంశాన్ని ప్రస్తావించారు. ముఖ్యంగా తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాకు అనుసంధానమైన యూపీఐని ఉపయోగించే విధానాన్ని చూపించడంతో టీనేజర్లలో సురక్షితమైన డిజిటల్ మనీ మేనేజ్మెంట్పై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.
రెడ్ బుల్:
2026 ఐపీఎల్ సమయంలో వైభవ్ సూర్యవంశీ తన రాజస్థాన్ రాయల్స్ సహచరుడు ధ్రువ్ జురెల్‌తో కలిసి రెడ్ బుల్ నిర్వహించిన ప్రత్యేక ఛాలెంజ్‌లో పాల్గొన్నాడు. ఈ ఛాలెంజ్‌లో 30 బంతుల్లో 60 పరుగులు చేయాల్సి ఉండగా.. యువ ఆటగాళ్లు తమ బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఐపీఎల్ సమయంలో జరిగిన ఈ ప్రచారం వైభవ్‌కు ఉన్న బ్రాండ్ అప్పీల్‌ను మరింత పెంచింది. అతడి క్రికెట్ ప్రతిభతో పాటు యువతలో ఉన్న పాపులారిటీని బ్రాండ్లు ఉపయోగించుకుంటున్నాయి.
జార్ఖండ్ ఆరోగ్య శాఖ:
వైభవ్ సూర్యవంశీకి మరో బాధ్యత కూడా దక్కింది. యువతలో ఫిట్నెస్, ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు అతడిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు జార్ఖండ్ ఆరోగ్య మంత్రి 2026 మేలో ప్రకటించారు. యువతకు వైభవ్ స్ఫూర్తిగా నిలిచే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. చిన్న వయసులోనే క్రీడల్లో అత్యున్నత స్థాయికి ఎదుగుతున్న అతడి ప్రయాణాన్ని యువతకు ప్రేరణగా చూపించాలన్నదే లక్ష్యం. రాబోయే రోజుల్లో బుడ్డోడి క్రికెట్ కెరీర్‌తో పాటు బ్రాండ్ విలువ కూడా ఏ స్థాయికి చేరుతుందనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
-
Alias Rukmini : నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!