ఈరోజు రాజ్‌కోట్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగో టీ20 జరగనుంది. విశాఖలో జరిగిన గత మ్యాచ్‌లో గెలిచి సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకున్న టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ గెలవాల్సి ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ దక్షిణాఫ్రికా గెలిస్తే ఐదు టీ20ల సిరీస్ ఆ జట్టు సొంతం అవుతుంది. ఎందుకంటే ఆ జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. అయితే ఈ సిరీస్‌లో టీమిండియాను కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ కలవరపెడుతోంది. వరుసగా మూడు మ్యాచ్‌లలో 29, 5, 6 పరుగులు చేసి పంత్ నిరాశపరిచాడు. కెప్టెన్ అన్న ఆలోచన మాని తన సహజ శైలిలో పంత్ ఆడాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.
రాజ్‌కోట్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ భారీ స్కోర్లు నమోదవుతాయని ఆటగాళ్లు భావిస్తున్నారు. గత మ్యాచ్ తరహాలో ఓపెనర్లు ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ చెలరేగాలని భారత్ కోరుకుంటోంది. శ్రేయాస్ అయ్యర్, హార్డిక్ పాండ్యా భారీ ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంది. మరోవైపు గత మ్యాచ్‌లో బౌలర్ల ప్రదర్శన బాగుంది. ముఖ్యంగా స్పిన్నర్ చాహల్, పేసర్ హర్షల్ పటేల్ మరోసారి సత్తా చాటాలని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో గాయపడిన అవేష్ ఖాన్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ తుది జట్టులో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్షర్ పటేల్, హార్డి్క్ పాండ్యా కూడా బౌలింగ్‌లో రాణించాల్సి ఉంది. దక్షిణాఫ్రికా జట్టులో హెండ్రిక్స్ స్థానంలో గాయపడి కోలుకున్న డికాక్ జట్టులోకి చేరవచ్చు.
Team India: ఇంగ్లండ్ బయలుదేరిన టీమిండియా.. రోహిత్ శర్మ మిస్సింగ్