Asia Cup 2022: భారత్, పాకిస్థాన్ జట్లకు షాక్.. మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asia Cup 2022: ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లకు ఐసీసీ షాక్ ఇచ్చింది. ఇరు జట్ల ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించింది ఐసీసీ. ఆదివారం నాడు దాయాది దేశాల మధ్య జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయంలోపు భారత్, పాకిస్థాన్ జట్లు తమ ఓవర్లను పూర్తి చేయలేకపోయాయి. దీంతో రెండు జట్లు జరిమానా బారిన పడ్డాయి. ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్ రిఫరీ ముందు తమ తప్పును అంగీకరించారని ఐసీసీ ప్రకటించింది. ఇటీవల ఐసీసీ కొత్త నిబంధనలు అమలులోకి తెచ్చింది. ఒక మ్యాచ్‌లో నిర్ణీత సమయం కంటే తక్కువగా ఓవర్లను బౌలింగ్ చేస్తే ఆటగాళ్లకు స్లో ఓవర్ రేట్ ఫైన్‌తో పాటు మ్యాచ్‌లో 30 గజాల సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లకు బదులు నలుగురు మాత్రమే ఫీల్డింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
Read Also: Viral Video: ఇది బైక్ కాదు.. మినీ వ్యాన్.. ఒకే బైకుపై ఏడుగురు ప్రయాణం
Also Read
- Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
- 2027 ODI World Cup: ప్రపంచ కప్‌కు పసికూన నేరుగా అర్హత.. రెండుసార్లు ఛాంపియన్‌కు బిగ్ షాక్!
- Vaibhav Sooryavanshi: మైదానంలోనే కాదు మార్కెట్లోనూ వైభవ్ జోరు.. 15 ఏళ్లకే కోట్లలో సంపాదన!
- Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
ఈ నిబంధన ఇటీవల భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో ఇరు జట్లకు చేటు చేసింది. పాకిస్థాన్ ఇన్నింగ్స్ సందర్భంగా టీమిండియా చివరి రెండు ఓవర్లను ఆలస్యంగా వేసి మూల్యం చెల్లించుకుంది. నలుగురు ఫీల్లర్లు మాత్రమే సర్కిల్ బయట ఉండటంతో పాకిస్థాన్ టెయిలెండర్ షానవజ్ దహాని ధాటిగా ఆడాడు. 130 పరుగులకే పరిమితమయ్యే జట్టు స్కోర్‌ను 147 వరకు తీసుకెళ్లాడు. అటు భారత ఇన్నింగ్స్ సందర్భంగా పాకిస్థాన్ మూడు ఓవర్లను ఆలస్యంగా వేసి మూల్యం చెల్లించుకుంది. ఫీల్డింగ్ బయట నలుగురు ఫీల్డర్లే ఉండటంతో జడేజా, హార్దిక్ పాండ్యా ఎలాంటి ఒత్తిడి లేకుండా బౌండరీలు రాబట్టి విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. కాగా భారత్, పాకిస్థాన్ జట్లు ఆసియాకప్‌లో మరోసారి వచ్చే ఆదివారం తలపడే అవకాశం కనిపిస్తోంది. అప్పుడైనా స్లో ఓవర్ రేట్ నుంచి తప్పించుకుంటారో లేదో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!
-
Tamil Nadu: “తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది”.. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
-
KTR: ‘8+8 = 0’.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సెటైర్లు..!
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ స్పైడర్ మ్యాన్ అవ్వాలనుకున్నాడా? మరి ఎందుకు కుదరలేదు?
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!