ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనున్న టీమిండియా క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. భారత పేస్ బౌలర్ మహ్మద్ షమీకి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఆస్ట్రేలియాతో సెప్టెంబర్ 20 నుంచి మొహాలీలో ప్రారంభం కానున్న టీ-20 సిరీస్‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలడంతో ఈ సిరీస్‌కు షమీ దూరంగా ఉండనున్నాడు.