India Breaks 17 Year Old Record In West Indies: భారత్, వెస్టిండీస్ మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. విండ్సర్ పార్క్ డొమినికా స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓ అరుదైన రికార్డ్ నమోదు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో భాగంగా బ్యాటింగ్ చేసేందుకు బరిలోకి దిగిన భారత ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మ.. జట్టుకి శుభారంభాన్ని అందించారు. ఇద్దరు కసితీరా బ్యాటింగ్ చేస్తూ.. తొలి వికెట్‌కి లంచ్ సమయంలోపే 100 పరుగుల్ని జోడించారు. ఈ క్రమంలో ఈ జోడీ ఓ సంచలన రికార్డ్ నమోదు చేసింది. టెస్ట్ క్రికెట్‌లో 17 సంవత్సరాల తర్వాత వెస్టిండీస్ గడ్డపై 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తొలి ఓపెనింగ్ జోడీగా చరిత్ర సృష్టించింది. కరేబియన్ గడ్డపై 13 టెస్ట్‌ల తర్వాత భారత ఓపెనర్లు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం గమనార్హం.
Women Harassment: టాలీవుడ్ లేడీ డైరెక్టర్ ను వేధించిన పోకిరి.. పార్క్ లో వాటిని చూపిస్తూ..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు.. కేవలం 64.3 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. అలిక్ అతనేజ్ అనే బ్యాటర్ ఒక్కడే 47 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. ఐదుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. భారత బౌలర్ల ధాటికి.. విండీస్ బ్యాటర్లలో ఎవ్వరూ ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. ముఖ్యంగా.. రవిచందర్ అశ్విన్ అయితే విండీస్ బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు. 24.3 ఓవర్లలో కేవలం 60 పరుగులే ఇచ్చిన అశ్విన్.. ఐదు వికెట్లు పడగొట్టాడు. జడేజా మూడు వికెట్లు పడగొట్టగా.. శార్దూల్, సిరాజ్ చెరో వికెట్ తీశారు. విండీస్ జట్టు ఆలౌట్ అవ్వడంతో బరిలోకి దిగిన భారత్.. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే దూసుకుపోతోంది. కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న యశస్వీ జైస్వాల్.. అంచనాల్ని అందుకుంటూ హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. 104 బంతుల్లో అర్థశతకం చేశాడు. అటు.. రోహిత్ కూడా 106 బంతుల్లోనే అర్థశతకం మార్క్‌ని అందుకున్నాడు.
Anasuya : నడి రోడ్డు పై నాభి అందాలతో రెచ్చగొడుతున్న అనసూయ..