Rajashree Swain: మహిళా క్రికెటర్ అనుమానాస్పద మృతి.. శరీరంపై గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha Cricketer Rajashree Swain Found Dead In Katak Forest: ఒడిశాలో ఈనెల 11వ తేదీన కనిపించకుండా పోయిన మహిళా క్రికెటర్ రాజశ్రీ స్వైన్ అడవిలో శవమై కనిపించింది. కటక్‌కి సమీపంలో ఉన్న దట్టమైన అడవిలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఒక చెట్టుకు వేలాడుతూ, ఉరి వేసుకున్న స్థితిలో గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రాజశ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. అసహజ మరణం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించగా.. రాజశ్రీ మృతదేహం లభ్యమైన కొంతదూరంలో ఆమె స్కూటర్ లభించింది. చెట్టుకు వేలాడుతూ కనిపించింది కాబట్టి.. ఆమె ఆత్మహత్య చేసుకుందా? ఎవరైనా చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? అనేది ఇప్పుడే చెప్పలేమని.. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక ఆమె మృతికి కారణం తెలుస్తుందని డీసీపీ పినాక్ మిశ్రా వెల్లడించారు.
Kite String Slits Throat: మాంజా కాదు మృత్యుపాశం.. చిన్నారితో పాటు మరొకరు మృతి
Also Read
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
మరోవైపు.. రాజశ్రీ కుటుంబసభ్యులు ఆమెను హత్య చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయని, కళ్లు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయని అంటున్నారు. ఒకవేళ నిజంగానే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే.. దట్టమైన అడవికి వెళ్లాల్సిన అవసరం ఉండదన్న పాయింట్‌ని లేవనెత్తుతున్నారు. ఎవరో కుట్ర పన్ని రాజశ్రీని హతమార్చారని పేర్కొంటున్నారు. అయితే పోలీసులు మాత్రం పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామంటున్నారు. కాగా.. రాజశ్రీ స్వైన్ ఒడిశాలోని పూరీ జిల్లాకు చెందిన క్రికెటర్. పుదుచ్చేరిలో జరిగే క్రికెట్ టోర్నీ కోసం.. ఒడిశా క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన శిక్షణ శిబిరంలో పాల్గొనేందుకు కటక్ వచ్చింది. అయితే.. 16 మందితో కూడిన జట్టులో మాత్రం ఆమె స్థానం సంపాదించుకోలేకపోయింది. జట్టులో తన పేరు లేకపోవడంతో.. రాజశ్రీ భోరున విలపించిందని ఆమె రూమ్మేట్ వెల్లడించింది. ఆ తర్వాత ఆమె హోటల్ గదికి రాలేదని తెలిపింది. రాజశ్రీ అదృశ్యంపై కోచ్ పుష్పాంజలి బెనర్జీ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు.
Hindu Terrorism: హిందూ టెర్రరిజం అనేది లేదు.. ఆర్టీఐలో వెల్లడి.
తాజావార్తలు
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!