IND Vs HKG: దుబాయ్ వేదికగా హాంకాంగ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కీలక మార్పు చేసింది. పాకిస్థాన్‌తో టీ20లో రాణించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో కీపర్ రిషబ్ పంత్‌ను తుది జట్టులోకి తీసుకుంది. రానున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో పాండ్యా తమకు చాలా కీలక ఆటగాడు అని.. అందుకే అతడికి విశ్రాంతి ఇచ్చినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ వివరించాడు. ఈ మ్యాచ్‌లో పాండ్యా స్థానంలో పంత్ ఆడతాడని చెప్పాడు. రిషబ్ పంత్ ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో ఆడలేదు. దినేష్ కార్తీక్‌ను తీసుకోవడంతో అతడు పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో రిజర్వ్ బెంచ్‌కు మాత్రమే పరిమితం అయ్యాడు.
కాగా ఈ మ్యాచ్‌లో హాంకాంగ్ టాస్ గెలిచింది. హాంకాంగ్ కెప్టెన్ నిజకత్ ఖాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత టీమిండియా బ్యాటింగ్ చేయనుంది. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ కావడంతో టీమిండియా భారీ స్కోరు చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.
తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, దినేష్ కార్తీక్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, చాహల్, అర్ష్‌దీప్ సింగ్
హాంకాంగ్: నిజకత్ ఖాన్ (కెప్టెన్), ముర్తాజా, హయత్, కించిత్, ఐజాజ్ ఖాన్, స్కాట్ మెక్ కెచ్నీ, జీషన్ అలీ, అర్షద్, ఎహసాన్ ఖాన్, ఆయుష్ శుక్లా, గజన్ఫర్
