ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీలలో భారత్, న్యూజిలాండ్ జట్లు వచ్చే ఆదివారం తలపడనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ పై భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేసాడు. ఈ న్యూజిలాండ్‌తో జరిగే సూపర్ 12 మ్యాచ్ ను క్వార్టర్ ఫైనల్ అని పిలవడం అన్యాయమని హర్భజన్ బుధవారం అన్నారు. అయితే ఈ రెండు జట్లు ప్రపంచ కప్ మొదటి మ్యాచ్ లో పాకిస్థాన్ చేతిలోనే ఓడిన విషయం తెలిసిందే. దాంతో ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారికే సెమీస్ కు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది అనేది తెలిసిందే. కివీస్ పై భారత జట్టు విజయం సాధిస్తుంది అని నేను నమ్ముతున్నారు. ఇండియా కోసం ఇక్కడ నుండి ప్రతి గేమ్ చాలా ముఖ్యమైనది. ఆటగాళ్లు దానికి సిద్ధంగా ఉన్నారని.. అలాగే వారు సరైన ఫలితాలను సాధిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని హర్భజన్ తెలిపారు. అయితే ఇప్పటివరకు ఐసీసీ టోర్నీలలో టీం ఇండియా ఒక్కసారి కూడా న్యూజిలాండ్ పై విజయం సాధించలేదు అబేది తెలిసిందే.