ప్రస్తుతం భారత క్రికెట్ లో ఒక అలజడి ఉన్న విషయం తెలిసిందే. నిన్న విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. కోహ్లీ వ్యాఖ్యలతో ఆయనకు, బీసీసీఐకి మధ్య గ్యాప్ ఉన్నట్టు తెలుస్తోంది. టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకుంటానంటే తాను వద్దని చెప్పినట్టు ఇటీవల గంగూలీ తెలిపాడు. అయితే బీసీసీఐ అలా చెప్పలేదని కోహ్లీ స్పష్టం చేశాడు. సౌతాఫ్రికాతో టెస్ట్ టీమ్ సెలక్షన్‌కు గంటన్నర ముందు మాత్రమే బీసీసీఐ తనను కాంటాక్ట్ చేసిందన్నారు కోహ్లీ. టీ20 కెప్టెన్సీ వదులుకునే ముందు తాను బీసీసీఐకి చెప్పానని, దాన్ని వారు స్వాగతించినట్టు తెలిపాడు.
అయితే ఇప్పుడు గంగూలీ కామెంట్స్ కి విరుద్దంగా కొహ్లీ మాట్లాడటం చాలా చర్చలకు దారి తీస్తుంది. అయితే ఈ విషయం పై భారత మాజీ లెజెండ్ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించాడు. గంగూలీ మాటలకూ… కోహ్లీ మాటలకూ తేడా ఉంది. కాబట్టి ఈ విషయం పై దాదానే స్వయంగా కోహ్లీతో మాట్లాడలి అని చెప్పాడు. వారిద్దరే మాట్లాడుకొని ఈ విషయం పై స్పష్టతకు రవళి అని పేర్కొన్నాడు.