IND vs ENG Test: లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు తడబడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కీలకమైన 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది టీమిండియా.
India playing XI against England for 5th Test: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య మరికాసేపట్లో చివరి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తుది జట్టులో మూడు మార్పులు చేశాడు. రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రాల స్థానాల్లో ధృవ్ జురెల్, కరుణ్ నాయర్, ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి వచ్చారు.…
Team India coach Ryan Ten Doeschate statement: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు హెడింగ్లీ, లార్డ్స్ టెస్టుల్లో ఓడిపోయింది. ఎడ్జ్‌బాస్టన్‌లో గెలిచిన టీమిండియా అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో 2-1తో వెనకబడి ఉంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు జులై 23 నుంచి ప్రారంభం కానుంది. మాంచెస్టర్‌లో అన్ని విభాగాల్లో సత్తాచాటి విజయం సాధించకుంటే సిరీస్ కోల్పోతుంది. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్‌లో భారత్ ఓటములకు అసలు…
ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో భారత్ ఓడిపోయింది. నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో గిల్ సేన 22 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (61 నాటౌట్) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. అనూహ్యంగా మహమ్మద్ సిరాజ్ బోల్డ్ అవ్వడంతో.. 193 పరుగుల చేధనలో భారత్ 170 పరుగులకు కుప్పకూలింది. ఈ ఓటమితో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 1-2తో వెనకపడిపోయింది. ఇక ఇంగ్లండ్, భారత్ మధ్య నాలుగో…
India playing XI vs England in Lord’s Test: మరికొద్దిసేపట్లో లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు ఆరంభం కానుంది. రెండో మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియాకు ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో మాత్రం పెను సవాల్ తప్పదు. రెండో టెస్టులో ఓడిన ఇంగ్లండ్ పుంజుకునేందుకు అన్ని అస్రాలు సిద్ధం చేసుకుంది. భారత్ కూడా ఒకటి, రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. తొలి రెండు టెస్టుల్లో అంతగా ప్రభావం…
టీమిండియా బ్యాటర్ కరుణ్ నాయర్ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. 8 ఏళ్ల 84 రోజుల అనంతరం, 402 మ్యాచ్‌ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన తొలి ఆటగాడిగా రికార్డులో నిలిచాడు. కరుణ్ నాయర్ చివరిసారిగా 2017లో ఆస్ట్రేలియాపై ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తరఫున ఆడాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ ప్లేయర్ రయద్ ఎమ్రిట్‌ను అధిగమించాడు. ఎమ్రిట్ 396 మ్యాచ్‌ల (10 ఏళ్ల 337 రోజులు) తర్వాత జాతీయ జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్ నంబర్-35లో గుజరాత్ టైటాన్స్ (GT) ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో తలపడుతోంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ కోల్పోయి ముందుగా బ్యాటింగ్ ప్రారంభించింది. ఆరు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌ను కైవసం చేసుకోవాలంటే గుజరాత్ 204 పరుగులు సాధించాల్సి ఉంటుంది. కాగా.. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ అక్షర్ పటేల్(39) రాణించాడు.…
భారత జట్టును ఎంపిక చేయడమంటే సెలక్టర్లకు చాలా కష్టమైన పని.. అందులో 15 మందితో స్క్వాడ్ అంటే ఇంకా ఇబ్బందిగా ఉంటుదని భజ్జీ చెప్పుకొచ్చాడు. కానీ, దేశవాళీలో అదరగొట్టిన వారికి అవకాశం కూడా కల్పించకపోలేకపోయారని వాపోయాడు.
2016లో చెన్నైలో ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ ఎనిమిదేళ్లుగా జట్టుకు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌పై అతని ఇన్నింగ్స్ ఒక చారిత్రాత్మక ఇన్నింగ్స్.. నాయర్ తన మొట్టమొదటి టెస్టు మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ సాధించాడు. అయితే ఆ తర్వాత నాయర్‌కు ఎక్కువ అవకాశాలు లభించలేదు.
కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహారాజా టీ20 టోర్నీలో కరుణ్ నాయర్ చెలరేగాడు. ఈ టోర్నీలో ఇప్పటికే లీడింగ్ రన్‌స్కోరర్‌గా నాయర్ కొనసాగుతుండగా.. గుల్భర్గా మిస్టిక్స్‌తో ఇవాళ (ఆగస్ట్ 28) 40 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.